భారీ స్థాయిలో కంగువ సాంగ్..ఏకంగా అంతమంది ఆర్టిస్టులా..?

murali krishna
తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న తాజా చిత్రానికి ‘కంగువా’ అనే టైటిల్‌ను ఇటీవల ఫిక్స్ చేసింది చిత్ర యూనిట్. ఈ సినిమాను దర్శకుడు శివ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాను ఫిక్షనల్ కథగా చిత్ర యూనిట్ రూపొందిస్తుండంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.కాగా, ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే సగానికిపైగా పూర్తయినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఇక ఈ సినిమా టైటిల్‌ను ఇటీవల అనౌన్స్ చేసింది చిత్ర యూనిట్. ఈ పోస్టర్‌కు ట్రెమెండస్ రెస్పాన్స్ రావడంతో, ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. కాగా, ఇప్పుడు ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ సాంగ్‌ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఇదిలా ఉంటే కంగువ సాంగ్ ఎలా ఉండబోతుందో తెలియజేస్తూ క్రేజీ వార్త ఒకటి అభిమానులను ఖుషీ చేస్తోంది. ఈ పాట 1000 మంది ఆర్టిస్టులతో భారీ స్థాయిలో ఉండబోతుందని కొరియోగ్రఫర్‌ ఓ చిట్‌ చిట్‌ సెషన్‌లో చెప్పింది. ఈ ఒక్క అప్‌డేట్‌తో కంగువ సాంగ్‌ గూస్‌బంప్స్ తెప్పించడం ఖాయమని చెప్పకనే చెబుతోంది. ఫస్ట్‌ సాంగ్‌ లాంచ్‌ జులై 23న ఉండబోతున్నట్టు తెలుస్తోండగా.. మేకర్స్‌ నుంచి దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
కంగువ అక్టోబర్‌ 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. కంగువ రెండు పార్టులుగా రాబోతుంది. ఇప్పటికే లాంచ్ చేసిన కంగువ గ్లింప్స్ ‌,వీడియో, పోస్టర్లు సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి. ఈ చిత్రంలో బాబీ డియోల్ ఉధిరన్‌ పాత్రలో నటిస్తున్నాడు.కంగువను స్టూడియో గ్రీన్-యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తుండగా.. 10 భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ చిత్రానికి రాక్‌ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌, బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ అందిస్తున్నాడు.ఈ చిత్రాన్ని నైజాం ఏరియాలో పాపులర్ టాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్‌ మైత్రీ మూవీ మేకర్స్‌ విడుదల చేస్తోంది.ఈ సినిమాలో బాలీవుడ్ న‌టుడు బాబీ డియోల్ కీలక పాత్రలో నటిస్తున్నాడని తెలిసిందే. సూర్య కెరీర్‌లో బ్లాక్ బస్టర్‌ ఆల్బమ్స్ అందించిన రాక్‌ స్టార్ దేవీశ్రీ ప్రసాద్‌ కంగువ చిత్రానికి బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌, మ్యూజిక్‌ అందిస్తున్నాడు. కంగువ గతానికి, ప్రస్తుతకాలానికి మధ్య ఉండే కనెక్షన్‌తో సాగే స్టోరీలైన్‌ ఆధారంగా కంగువ తెరకెక్కుతున్నట్టు ఇన్‌సైడ్‌ టాక్‌. సూర్య మరోవైపు సుధా కొంగర డైరెక్షన్‌లో సూర్య 43లో కూడా నటిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: