ప్రజంట్ సోషల్ మీడియాలో చాలా రకాల ఫన్ కంటెంట్ వైరల్ అవుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు మీమ్స్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. పెద్ద..పెద్ద రాజకీయ నేతల నుంచి సినిమా సెలబ్రిటీల వరకు ఎవ్వరినీ వదలడం లేదు మీమ్ క్రియేటర్స్. క్రియేటివిటీతో పిచ్చెక్కిస్తున్నారు. వాటిని చూసిన నెటిజన్స్ తెగ నవ్వుకుంటారు. అయితే హద్దు మీరనంతవరకు మీమ్స్ ఓకే. పరిధి దాటి వేరే వాళ్ల పర్సనల్ విషయాల్లోకి వెళ్లడం మాత్రం కరెక్ట్ కాదు. ఇటీవల కొన్ని ఫన్నీ పోస్టులు కూడా భలే ఎంటర్టైన్ చేస్తున్నాయి. అందులో స్టూడెంట్స్ ఎగ్జామ్స్‌లో రాసే ఫన్నీ ఆన్సర్స్ కూడా ఉంటున్నాయి.పరీక్షల్లో ఇచ్చిన ప్రశ్నలకు ఆన్సర్స్ తెలియనప్పుడు కొందరు స్టూడెంట్స్ అతి తెలివి ప్రదర్శిస్తున్నారు. సినిమా స్టోరీలు, తమ తెలిసిన విషయాలు రాసి పేపర్లు నింపేస్తూ ఉంటారు. అలా మాకు తారసపడిన ఓ పోస్ట్‌ను మీ ముందుకు తీసుకొచ్చాం. ఓ ఇస్మార్ట్ స్టూడెంట్స్ ఏం ఆన్సర్ రాశాడో తెలిస్తే మీరు బిత్తరపోతారు. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ అనేది ఓ వ్యసనంగా మారిపోయింది. స్మార్ట్‌ఫోన్ వల్ల ఎన్ని ఉపయోగాలున్నాయో, అనే దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి. ఆధునిక జీవితంలో స్మార్ట్‌ఫోన్ యొక్క ప్రాముఖ్యం గురించి పరీక్షలో ఓ విద్యార్థి తనదైన శైలిలో విశ్లేషించాడు.
ఆధునిక జీవితంలో స్మార్ట్‌ఫోన్ యొక్క ప్రాముఖ్యం గురించి పరీక్షలో ఓ విద్యార్థి తనదైన శైలిలో విశ్లేషించాడు. మొబైల్ లేకపోతే జీవితమే లేదని తేల్చాడు. అతడి అనాలిసిస్ నచ్చడంతో టీచర్ ఏకంగా పదికి పది మార్కులు వేశారు . ఆ వైరల్ పోస్ట్ ప్రకారం.. ప్రశ్నాపత్రంలో మొబైల్ వినియోగానికి సంబంధించి ప్రశ్నలు అడిగారు. దానికి ఆ కుర్రాడు రకరకాల విశ్లేషణలు చేసి చివరకు మొబైల్ లేనిదే జీవితంలో లేదని తేల్చాడు. `మొబైల్ లేకపోతే మూడ్ బాగోదు.. మూడ్ బాగోలేకపోతే.. చదువు రాదు. చదువుకోకపోతే ఉద్యోగం రాదు., ఉద్యోగం లేకపోతే డబ్బు రాదు. డబ్బు లేకుండా, ఆహారం లభించదు. ఆహారం లేకపోతే అందవికారంగా మారుతాం. అప్పుడు ఎవరూ ప్రేమించరు.. పెళ్లి కూడా చేసుకోరు. అప్పుడు, ఒంటరిగా ఉండి డిప్రెషన్‌లోకి వెళ్లిపోతాం. డిప్రెషన్‌లోకి వెళితే అనారోగ్యానికి గురై చనిపోతాం..` అని రాశాడు.చివర కంక్లూజన్ ఇస్తూ, `నో మొబైల్.. నో లైఫ్` అని రాశాడు. ఈ జవాబు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను 2.4 కోట్లకు పైగా వీక్షించారు. 4.8 లక్షల మంది లైక్ చేసారు. ఈ పోస్ట్‌పై నెటిజన్లు ఫన్నీగా స్పందించారు. `ఆ టీచర్ కూడా మొబైల్‌కు అడిక్ట్ అయినట్టున్నారు.. అందుకే పదికి పది మార్కులు వేశారు, ``ఇదే ఆధునిక జీవితం, ``చాలా ప్రాక్టికల్ అనాలిసిస్, ``ఇదే చేదు నిజం` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.