N కన్వెన్షన్ కుల్చివేతపై.. హీరో నాగార్జునకు ఊరట..!
శనివారం ఉదయం హైదరాబాదులో N కన్వెన్షన్ సెంటర్ ను అయితే కూల్చివేయగా హీరో నాగార్జున కూడా స్పందిస్తూ చెరువు భూముని ఒక అంగుళం కూడా ఆక్రమించలేదని కూడా తెలియజేశారు.ఈ కూల్చివేతకు తాము ఖచ్చితంగా న్యాయస్థానానికి వెళ్తామంటూ చెప్పి వెళ్లడం జరిగింది. ఈ విషయం పైన తమ గురించి ప్రజలకు కేవలం తప్పుడు సంకేతాలు ఇస్తున్నారంటూ తెలియజేశారు నాగార్జున. కూల్చివేయడానికి ముందు తమకు ఎలాంటి నోటీసులో కూడా జారీ చేయలేదని.. అలాగే ఒక వైపు కేసు కోర్టులో ఉన్నప్పుడే ఇలా చేయడం సరికాదని కూడా తెలియజేశారు.
చట్టాలని తాను కూడా గౌరవిస్తానని కోర్టు వ్యతిరేకంగా తమకు తీర్పు ఇస్తే కూల్చివేయమనే వాళ్ళము అంటూ హీరో నాగార్జున తన ట్విట్టర్ నుంచి తెలియజేశారు.. స్టే ఆర్డర్లు మరియు కోర్టు కేసులకు సైతం విరుద్ధంగా N కన్వెన్షన్ కూల్చివేత చేపట్టడం చాలా బాధాకరంగా అనిపిస్తుంది అంటూ తెలిపారు నాగార్జున. వాస్తవాలను తెలుసుకోవాలని ఇలా ట్విట్టర్లో తెలియజేశాము అంటూ తెలిపారు. మా భూమి పట్టా ఒక అంగుళం ట్యాంక్ ప్లాన్ కూడా అక్రమంగా కట్టలేదని తెలియజేశారు. ప్రైవేటు స్థలంలో నిర్మించిన భవనమది.. N కన్వెన్షన్ సెంటర్ మూడు రియాల్టీ ఎంటర్టైజ్ ప్రైస్ కింద నడుస్తున్నదట.. దీని స్పెషల్ ఏమిటంటే పిల్లర్లు లేకుండానే హై సీలింగ్ తో నిర్మించారట. సుమారుగా ఇందులో రెండు నుంచి మూడు వేల మంది కూర్చోవచ్చట. చాలా ఫంక్షన్స్ కూడా ఇక్కడ జరిగేవట.