ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ చేసుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక..?

Pandrala Sravanthi
 సినిమా ఇండస్ట్రీలో కొన్ని ప్రేమజంటలు ఉంటాయి. అయితే ఇది ఇండస్ట్రీ మొదలైనప్పటి నుండి ఇప్పటివరకు కొనసాగుతున్న తంతే..అయితే కొంతమంది పెళ్లయ్యాక కూడా వేరే వారిని ప్రేమిస్తూ ఉంటారు. ఇంకొంతమంది పెళ్లికి ముందే ప్రేమించి పెళ్లిళ్లు చేసుకుంటారు. మరి కొంత మంది ప్రేమ పెళ్లి దాకా వెళ్ళదు. అయితే ప్రస్తుత జనరేషన్ లో టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రభాస్ అనుష్క, తమన్నా విజయ్ వర్మ, జాన్వీ కపూర్ శిఖర్ పహారియా, విజయ్ దేవరకొండ రష్మిక మందన్నా వంటి కొంతమంది ప్రేమ పక్షులు ఉన్నారు. అయితే వీరందరిలో విజయ్ దేవరకొండ రష్మిక మందన్నా చాలా స్పెషల్.. రౌడీ హీరో విజయ్ దేవరకొండ నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కాంబినేషన్లో గీత గోవిందం, డియర్ కామ్రేడ్ వంటి సినిమాలు వచ్చాయి. అంతేకాదు మంచి కథ దొరికితే మళ్ళీ మా కాంబోలో సినిమా వస్తుంది అని రష్మిక ప్రతిసారి చెబుతూనే ఉంటుంది.

 అయితే గీత గోవిందం సినిమా టైం నుండి వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని,ప్రస్తుతం వీరిద్దరూ తమ లవ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తున్న సంగతి మనకు తెలిసిందే.అంతే కాదు కొన్ని పండగలకు కూడా రష్మిక విజయ్ దేవరకొండ ఇంటికి వెళ్లిన ఫొటోస్ మీడియాలో చక్కర్లు కొడతాయి. అలాగే వీరిద్దరూ కలిసి వెకేషన్ కి వెళ్ళిన ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చేసి నెటిజన్స్ కి అడ్డంగా బుక్ అయిన రోజులు కూడా చాలానే ఉన్నాయి.కానీ వీరి మధ్య ప్రేమ వార్తలు చక్కర్లు కొట్టిన ప్రతిసారి మా మధ్య అలాంటిదేమీ లేదు మేము జస్ట్ స్నేహితులమే అంటూ చెబుతారు. కానీ వీరి మధ్య ఉన్న ప్రేమ బంధం అందరికీ తెలుసు.. ఇక రష్మిక విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ సినిమాలకి సపోర్ట్ చేస్తూ ప్రీ రిలీజ్ ఈవెంట్ లకి,ఆడియో ఫంక్షన్లకి వస్తూ ఉంటుంది.

 ఇదంతా పక్కన పెడితే తాజాగా ఈ లవ్ బర్డ్స్ త్వరలోనే భార్యాభర్తలు గా మారబోతున్నట్టు టాలీవుడ్ మీడియాలో ఓ టాక్ వినిపిస్తోంది. ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ఈ జంట త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారట.అంతేకాదు ఆగస్టు రెండో వారంలో విజయ్ దేవరకొండ రష్మిక మందన్నా లు అతి కొద్ది మంది సన్నిహితుల మధ్యలో తమ నిశ్చితార్థ వేడుకను జరుపుకుంటారని,ఆ తర్వాత అక్టోబర్ లేదా నవంబర్ లో గ్రాండ్ గా పెళ్లి చేసుకోబోతున్నట్టు సమాచారం. అయితే ఇప్పటికే చాలాసార్లు వీరి పెళ్ళంటూ వార్తలు వినిపించాయి.కానీ ఏది నిజం కాలేదు. అయితే ఆ మధ్యకాలంలో విజయ్ దేవరకొండ మరో రెండు సంవత్సరాల్లో పెళ్లి చేసుకుంటానని కూడా హింట్ ఇచ్చారు. అయితే తాజాగా ఈ జంట పెళ్లి చేసుకోవడానికి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.మరి చూడాలి వీరి ఎంగేజ్మెంట్, పెళ్లి అంటూ వస్తున్న వార్తల్లో ఎంత నిజం ఉంది అనేది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: