షాక్: హత్య కేసులో జైలర్ డైరెక్టర్ భార్య.. ఇబ్బందులు తప్పవా..!

Divya
కోలీవుడ్లో డైరెక్టర్ గా మంచి పాపులారిటీ సంపాదించుకున్న నెల్సన్ దిలీప్ కుమార్.. ఎన్నో చిత్రాలతో ప్రేక్షకులను బాగా అలరించారు. చివరిగా జైలర్ సినిమాతో మంచి విజయాన్ని కూడా అందుకున్నారు. రజనీకాంత్ కెరీయర్ని మళ్లీ ఈ సినిమా మార్చేసింది. ఇదంతా ఇలా ఉండగా తాజాగా డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ భార్య మౌనిష ఒక హత్య కేసులో ఈమె పేరు వినిపిస్తోంది.. జులై ఐదవ తేదీన బహుజన సమాజ్ పార్టీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి అమ్ స్ట్రాంగ్ హత్య కేసు కు సంబంధించి విచారణ చేస్తూ ఉండగా నెల్సన్ దిలీప్ కుమార్ భార్య పేరు రావడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.
అమ్ స్ట్రాంగ్ హత్య కేసులో విచారణ చేస్తున్నప్పుడు 20 మందికి పైగా అరెస్టు చేశారట. ఈ కేసులో నిందితుడు రౌడీ సాంబో తో పాటు.. సెంథిల్ అనుచరుడు మొట్టయి కృష్ణన్ న్యాయవాది ఇండియా నుంచి పారిపోయి విదేశాలలో తలదాచుకున్నాడట. దీంతో అతడి మీద నోటీసులు కూడా జారీ చేసింది అక్కడి ప్రభుత్వం. అయితే విదేశాలకు పారిపోయిన మొట్టై కృష్ణన్ ప్రముఖ డైరెక్టర్ గా పేరుపొందిన నెల్సన్ భార్య మౌనిషా అతనితో సంభాషించిన తర్వాత సుమారుగా 75 లక్షల రూపాయల సైతం ఈమె అకౌంట్ నుంచి అతని అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసినట్లుగా గుర్తించామని అధికారులు తెలుపుతున్నారు.

ఈ విషయం పైన మౌనిష లాయర్ మాత్రం ఇది తప్పుడు సమాచారం అని న్యాయవాది వివరణ ఇచ్చారు.అమ్ స్ట్రాంగ్ హత్య కేసులో డైరెక్టర్ నెల్సన్ ని కూడా ప్రత్యేకంగా విచారిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అమ్ స్ట్రాంగ్  హత్య కేసులో నిందితుడిగా ఉన్న మొట్టై కృష్ణ కూడా ఇతడి స్నేహితుడు కావడంతో ఏదైనా సమాచారం లభిస్తుందా అంటూ విచారిస్తున్నారట అధికారులు. మరి ఈ విచారణ జరుగుతుందో లేదో అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.ప్రస్తుతం అయితే ఈ విషయం తమిళ ఇండస్ట్రీలోని ఒక సంచలనంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: