అఖండ 2 : నైజాంలో ప్రీమియర్ కలెక్షన్ల లెక్క ఇదే.. !
గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను కలయికలో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ సినిమా అఖండ 2 - తాండవం. భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా గత రాత్రి నుంచే ప్రీమియర్ షోల తో చాలా గ్రాండ్ గా ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ల లోకి దిగింది. ఇక ఫైనల్ గా టాక్ తో సంబంధం లేకుండా అఖండ సినిమాకు ప్రీమియర్ షోలకు , అటు తొలి రోజు షోలకు సాలిడ్ బుకింగ్స్ నమోదు అయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమాకు సాలిడ్ బుకింగ్స్ నమోదు అవుతున్నాయి. బాలయ్య అఖండ 2 కి నైజాం మార్కెట్ లో కూడా మంచి హైప్ నెలకొంది అనేందుకు ఇక్కడ ప్రీమియర్లకు నమోదు అయిన నెంబర్సే ఉదాహరణ అని చెప్పాలి.
నైజాంలో కేవలం ప్రీమియర్స్ వసూళ్ళగానే 2.3 కోట్ల షేర్ ని ఈ సినిమా రాబట్టిందని ట్రేడ్ వర్గాల లెక్కలు చెపుతున్నాయి. ఇటీవల కాలంలో ప్రీమియర్స్ తో వచ్చిన సినిమాల్లో మంచి ఓపెనర్ గా అఖండ 2 నిలిచింది. ఇక తొలి రోజు కూడా నైజాంలో భారీ నెంబర్లు నమోదు కానున్నాయి. అటు ఏపీ లో కూడా అఖండ 2 ప్రీమియర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. గుంటూరు - సీడెడ్ లాంటి ఏరియాల్లో భారీ ఆక్యుపెన్సీలు కనిపించాయి. కానీ వీటిని మించి డే 1 వసూళ్లు అఖండ 2 కి ఎక్కువ ఉంటాయని లెక్కలు చెపుతున్నాయి.
ఈ వాట్సాప్ నెంబర్కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు.