విజయ్ "ది గోట్" - భారీ రన్‌టైమ్‌తో కొత్త రికార్డులు!

Anilkumar
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తాజాగా నటిస్తున్న ది గోట్ సినిమా గురించి అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమాను దర్శకుడు వెంకట్ ప్రభు   తెరకెక్కిస్తున్నారు. కాగా ఇందులో యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో స్నేహ, లైలా, ప్రశాంత్, ప్రభుదేవా, యోగి బాబు, జయరామ్, మోహన్, వైభవ్, వీటీవీ గణేష్, అజ్మల్ అమీర్, మనోబాల కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. అయితే ఇందులో నుంచి థియేట్రికల్ ట్రైలర్ కొద్ది రోజుల క్రితం రిలీజ్ అయి ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటుంది. ఇక ట్రైలర్ చూసిన తర్వాత అభిమానులలో ఈ సినిమాపై మరింత అంచనాలు పెరిగిపోయాయి.

ఇకపోతే ఈ సినిమా నుంచి తాజా అప్డేట్ ఒకటే బయటకు వచ్చింది అదేంటంటే. ఈ చిత్రం భారీ రన్ టైమ్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. సాధారణంగా తెలుగు చిత్రాలు 2 గంటల నుండి 2 గంటల 30 నిమిషాల మధ్య ఉంటాయి. కానీ ది గోట్ చిత్రం 2 గంటల 59 నిమిషాల నిడివితో ఉండబోతోంది. ది గోట్ చిత్రంపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. విజయ్ యొక్క గత చిత్రాలు ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకున్నాయో తెలిసిందే. దీంతో ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. ఇక ఈ చిత్రం ఒక యాక్షన్ ఎంటర్‌టైనర్ అని తెలుస్తోంది.

 విజయ్ తన కెరీర్‌లో ఇలాంటి పాత్రను చేయడం ఇదే మొదటిసారి కావడం విశేషం. కాగా అర్చన కల్పాతి, కల్పాతి ఎస్ అఘోరమ్, కల్పాతి ఎస్ గణేష్ అంతే కాకుండా కల్పాతి ఎస్ సురేష్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించారు. సెప్టెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. దానితో ప్రేక్షకులు అంతా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ సినిమాతో  ఈ కోలీవుడ్ హీరో ఎంతటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: