విజయసాయిరెడ్డిని వదలబోము అంటున్న లోకేష్?

Suma Kallamadi
ఏపీలో గత కొన్ని రోజులుగా విజయసాయి రెడ్డి గురించి చర్చలు నడుస్తున్నాయి. దానికి కారణం అందరికీ తెలిసినదే... ఏపీ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతికి, మాజీ మంత్రి విజయసాయి రెడ్డికి అక్రమ సంబంధం ఉందని గత కొన్ని రోజులుగా మీడియాలు గగ్గోలు పెడుతున్నాయి. ఇక ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి ఒక ప్రెస్ మీట్ నిర్వహిస్తూ జర్నలిస్టులపై విరుచుకుపడ్డారు. జర్నలిస్టు స్థాయి వంటి వ్యక్తులు తమపై ఇలాంటి నీచాతి నీచమైన ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదని, దానికి వారు తగిన మూల్యం చెల్లించుకుంటారని విజయసాయిరెడ్డి వార్నింగ్ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసినదే. అయితే ఈ క్రమంలోనే విజయసాయిరెడ్డి పరుష పదజాలాన్ని వాడడం ఇప్పుడు వివాదంగా మారింది.
తనపై అనవసరమైన ఆరోపణలు వచ్చినప్పుడు నిజా నిజాలు అనేవి ఏమిటో తెలుసుకోకుండా జర్నలిస్టులు ఇలా పిచ్చి పట్టినట్టు ఏది పడితే అది వాగితే అంత మంచిది కాదని, కనీస విలువలు పాటించాలని వారికి సూచించారు విజయ్ సాయి రెడ్డి. ఈ క్రమంలోనే ఒక ఇద్దరు జర్నలిస్టులను ఉద్దేశించి వారు అసలు ఒక అమ్మ అబ్బకి పుట్టిన వారే కాదని, వారి పుట్టుక మీద నాకు అనుమానం కలుగుతోందని మాట్లాడుతూ అసహనం వ్యక్తం చేశారు సాయి రెడ్డి. అయితే ఈ మాటలపై మీడియాలో దుమారం చెలరేగుతోంది. నిప్పు లేనిదే పొగ రాదని... మంత్రిగా ఉన్నప్పుడు ఒళ్ళు మరచి ప్రవర్తించిన విజయసాయిరెడ్డి ఈరోజు శ్రీరంగనీతులు చెప్పడం చాలా హాస్యాస్పదం అని పలువురు జర్నలిస్టులు కౌంటర్ ఇస్తున్నారు. ఇక కమిషనర్ శాంతి మాజీ భర్త వారిద్దరికీ ఉన్న శరీరక సంబంధం గురించి మీడియా వేదికలపై సవాల్ చేసిన విషయం అందరికీ తెలిసిందే.
ఇక అసలు విషయంలోకి వెళితే ఇదే విషయమై నారా లోకేష్ తాజాగా విజయసాయిరెడ్డి టార్గెట్ చేస్తూ ఓ నోట్ రిలీజ్ చేశారు. అందులో లోకేష్ ప్రస్తావిస్తూ... విజయసాయి రెడ్డి గారికి చిన్నవాడినైన నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మీడియా జర్నలిస్టులపై మీరు వాడిన భాష అత్యంత అభ్యంతరకరం. వాడు, వీడు, ఒరేయ్, పోరా వంటి పదజాలం వాడు మిమ్మల్ని మీరు తక్కువ చేసుకున్నారు. మీ గురించి ఎవరన్నా ఆరోపణలు చేసినట్లయితే ఆ కోపాన్ని మీరు మీడియాపై ప్రదర్శించడం ఎంత మాత్రమూ సమంజసం కాదు. ఆరోపణల్లో నిజం లేనట్లయితే మిమ్మల్ని మీరు నిరూపించుకోండి. అంతేగాని ఇలా మీడియాపై విరుచుకుపడితే ఒరిగేది ఏమీ ఉండదని విజయసాయి రెడ్డికి లోకేష్ సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: