80 ఏళ్ల వయసులో డెడికేషన్ కి మీనింగ్లా మారిన బిగ్ బి?

Purushottham Vinay

2898 ఏడీ  సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి నిర్మాతలకు మంచి లాభాలను అందించడంతో పాటు అమితాబ్ బచ్చన్ కెరీర్ లో కూడా ఇదో స్పెషల్ సినిమాగా నిలిచింది.ఈ సినిమాలో ప్రభాస్ కంటే కూడా అమితాబ్ పాత్ర చాలా యూనిక్ గా ఉంటుంది.ఇక అమితాబ్ బచ్చన్ తాజాగా కల్కి షూట్ కు సంబంధించిన విశేషాలను పంచుకోగా ఆ విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కల్కి సినిమా షూట్ సమయంలో నేను వాష్ రూమ్ కు వెళ్లడానికి కూడా అనుమతి అడిగానని నాగ్ అశ్విన్  చెప్పారని అలా నేను అనుమతి అడగడం నిజమేనని అమితాబ్ బచ్చన్ అన్నారు.షూటింగ్ లో పాల్గొనే సమయంలో డైరెక్టరే కెప్టెన్ అని సెట్ లో ఉన్నంతసేపు నేను పనివాడిని మాత్రమేనని అమితాబ్ బచ్చన్ అన్నారు. ఆ సమయంలో నేను బయటకు వెళ్లాలంటే ఖచ్చితంగా డైరెక్టర్ అనుమతి తీసుకోవాల్సిందేనని ఆయన చెప్పుకొచ్చారు. 


సెట్ కు నన్ను పిలిచింది దర్శకుడు కాబట్టి దర్శకుడు చెప్పిన విషయాలను నేను తూచా తప్పకుండా పాటించాల్సి ఉందని అమితాబ్ బచ్చన్ తెలిపారు.నేను అదే చేశానని అమితాబ్ వెల్లడించారు. 80 సంవత్సరాల వయస్సులో కూడా అమితాబ్ యాక్షన్ సీన్స్ లో అదరగొట్టి ప్రశంసలు అందుకున్నారు. అమితాబ్ బచ్చన్ డెడికేషన్ ను ఎంత మెచ్చుకున్నా తక్కువేనని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. అమితాబ్ బచ్చన్ లాంటి హీరోలు కేవలం చాలా తక్కువ మంది ఉంటారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అమితాబ్ బచ్చన్ రెమ్యునరేషన్ కూడా భారీ స్థాయిలోనే ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.అమితాబ్ బచ్చన్ ఈ వయస్సులో కూడా చాలా కష్టపడుతూ ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తున్నారని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. కల్కి 2898 ఏడీ సినిమా ఫుల్ రన్ కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో ఇంకా చూడాల్సి ఉంది. కల్కి సీక్వెల్ లో కూడా అమితాబ్ బచ్చన్ రోల్ కు ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుందని సమాచారం తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: