నాగార్జున : N-కన్వెన్షన్ కూల్చివేత వెనుక చంద్రబాబు కుట్రలు ?

frame నాగార్జున : N-కన్వెన్షన్ కూల్చివేత వెనుక చంద్రబాబు కుట్రలు ?

Veldandi Saikiran
అక్కినేని నాగార్జునకు శనివారం ఉదయం ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఆయన మాదాపూర్ లో కట్టుకున్న ఎన్ కన్వెన్షన్.. ను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ధ్వంసం  చేసింది. మొత్తం 29 ఎకరాలలో... 3.30 ఎకరాలు... ఎన్ కన్వెన్షన్ నిర్మించారట ఆకినేని నాగార్జున. ఈ ఎన్ కన్వెన్షన్ లో... చాలా విఐపి ల వివాహాలు జరిగాయి. రేవంత్ రెడ్డి కూతురు.. వివాహం కూడా అక్కినేని నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ లోనే జరిగినట్లు సమాచారం.
 

అయితే ఈ ఎన్ కన్వెన్షన్ ను తమ్మిడి చెరువును కబ్జా చేసి మూడు ఎకరాలలో అక్కినేని నాగార్జున నిర్మించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా రంగంలోకి దిగింది హైడ్రా. శనివారం ఉదయం.. పెద్ద పెద్ద బుల్డోజర్లతో... ఎన్ కన్వెన్షన్.. దగ్గరకు చేరుకున్న హైడ్రాధికారులు... అక్కినేని నాగార్జునకు కూడా సమాచారం ఇవ్వకుండా ధ్వంసం చేశారు.

ప్రస్తుతం N కన్వెన్షన్...పూర్తిగా నెలమట్టం అయింది. అయితే నాగార్జున వ్యవహారంపై గులాబీ పార్టీ.. సోషల్ మీడియా విభిన్నంగా స్పందిస్తుంది. నాగార్జున కట్టడాలను ధ్వంసం వెనుక నారా చంద్రబాబు నాయుడు ఫోటోలు ఉన్నాయని గులాబీ పార్టీ సోషల్ మీడియా ఆరోపణలు చేస్తుంది. టాలీవుడ్ ఇండస్ట్రీ ని ఏపీకి తరలించే విధంగా ఎస్ సి ఎం రేవంత్ రెడ్డి తో ఈ నాటకాలు ఆడిస్తున్నాడని... చంద్రబాబుపై ఫైర్ అవుతోంది గులాబీ పార్టీ.
 

అంతేకాదు హీరో అక్కినేని నాగార్జున ఎన్ కన్వెన్షన్  నిర్మించుకునేలా 2010 సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందని... గులాబీ పార్టీ స్పష్టం చేస్తోంది. ఇక ఇప్పుడు రేవంత్ రెడ్డి... చంద్రబాబు మేలు కోసం... అక్కి నేని నాగా ర్జున ఫంక్షన్ హాల్ను ధ్వంసం  చేశాడని.. గులాబీ పార్టీ నేతలు చెబుతున్నారు.  ఇలాగే రేవంత్ రెడ్డి వ్యవహరిస్తే సినిమా  ఇండస్ట్రీ హైద రాబాద్ నుంచి ఏపీకి తరలిపోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: