ఎన్టీఆర్ 31 మూవీ ఎక్స్‌క్లూజీవ్‌ అప్డేట్ .. డ్రగ్ సామ్రాజ్యంలో డ్రాగన్ .. ఇది కథ అసలైన మేటర్..!

Amruth kumar
ఇక ఎన్టీఆర్ - ప్ర‌శాంత్ నీల్ కాంబోలో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే .. అతి త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళబోతుంది .. ఇప్పటికే లొకేషన్ వేట పూర్తయింది .. అలాగే సినిమాలో న‌టీన‌టుల ఎంపిక కూడా దాదాపు పూర్తయినట్టు తెలుస్తుంది .. ఈ సినిమా కోసం మలయాళం నుంచి బీజూ బీన‌న్‌ని, టోవినో థామ‌స్ ని పలు కీలక పాత్రల కోసం తీసుకోబోతున్నారట .. అలాగే హీరోయిన్ గా రుక్మిణి వసంత్ ఇప్పటికే ఖరారు అయింది .. మిగిలిన నటులు , సాంకేతిక నిపుణుల ఎంపిక కూడా జరిగిపోయింది  వాళ్ల వివరాలు ఒక్కొక్కటిగా బయటకు రాబోతున్నాయి .


ఇక ఈ సినిమా డ్రగ్ మాఫియా చుట్టూ తిరుగుతుందని ఇన్సైడ్ టాక్ బయటకు వచ్చింది .. మయన్మార్,  థాయిలాండ్ , లాయిస్‌లను క‌లిపి భౌగోళికంగా గోల్డెన్ ట్రయాంగిల్ అని పిలుస్తారు .. ఇక్కడి నుంచి కొకైన్ , గంజాయి ఎక్కువగా స్మగ్లింగ్ జరుగుతుంది .. డ్రగ్ సామ్రాజ్యానికి అదో స్వర్గం అలాంటిది అక్కడ జరిగే అరాచకాలు అక్రమాల నేపథ్యం లో ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ సినిమా ఉంటుందని సమాచారం .. ఇక ఈ సినిమాకి డ్రాగన్ అనే పేరు పరిశీలిస్తున్నారు .. ఈ నెల చివ‌రిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభ‌మ‌య్యే అవకాశాలు ఉన్నాయి ..

 అలాగే అంతకుముందు లుక్ టెస్ట్ నిర్వహిస్తారని తెలిసింది .. ఆగస్టు నాటికి ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయాలని ప్రశాంత్ నీల్‌ గట్టి ప్లానింగ్ పెట్టుకున్నాడు .. అలాగే ప్రశాంత్ నీల్ తెరకెక్కించే సినిమాలకు పోస్ట్ ప్రొడక్షన్ కి ఎక్కువ సమయం తీసుకుంటాడు .. అందుకే ఆగస్టులో గా షూటింగ్ పూర్తయితే పోస్ట్ ప్రొడక్షన్ కి కనీసం నాలుగు నెలలు సమయం దొరుకుతుంది .. అది ప్ర‌శాంత్ నీల్‌కు  సరిపోతుంది .. ఇక 2026 జనవరి సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు తీసుకురాబోతున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: