మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ చేంజర్ సినిమా సంక్రాంతి విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. జనవరి 10వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాకు తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వ వహించగా, భారీ బడ్జెట్ తో దిల్ రాజు నిర్మించారు. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ ఈ సినిమా విడుదలవుతోంది. చిత్రంలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ పోషించారు.
అందులో ఒక పాత్రకు అద్వానీ హీరోయిన్ గా నటించగా.. మరో పాత్రకు అంజలి హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే విడుదలైన సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. దీనితో సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం పొలిటికల్ బ్యాక్ డ్రాప్లో రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా సినిమాకు సంబంధించి మరో అంశం బయటకు వచ్చింది. ఈ సినిమాలో రామ్ చరణ్ ఫస్ట్ ఆఫ్ లో
కాలేజీ స్టూడెంట్ పాత్రలో కనిపించబోతున్నారట. అయితే ఈ పాత్ర అచ్చం అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండ పాత్రను పోలి ఉంటుందని తెలుస్తోంది.
స్టూడెంట్ పాత్రలో రామ్ చరణ్ యాంగ్రీ యంగ్ మ్యాన్ గా కలిగించబోతున్నట్టు తెలుస్తోంది. అర్జున్ రెడ్డి టాలీవుడ్ లో ట్రెండ్ సెట్టర్గా నిల్చున్న సంగతి తెలిసిందే. స్టూడెంట్ పాత్రలో విజయ్ యాంగ్రీ యంగ్ మ్యాన్ గా కనిపించగా.. ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక ఇప్పుడు రామ్ చరణ్ సైతం గేమ్ చేంజర్ లో అలాంటి పాత్రలోనే కనిపిస్తే అభిమానులకు గూస్ బంప్స్ రావడం పక్కా. అంతేకాకుండా ఆ పాత్ర యూత్ ని ఎక్కువగా ఆకట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి అదే జరిగితే ఇంకేం చేంజర్ కూడా బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశం ఉంది. ఇక శంకర్ సినిమా అంటేనే టైప్ వస్తుంది. అలాంటిది చెర్రీ యాంగ్రీ యంగ్ మ్యాన్ రోల్ అంటే సినిమాకు మరింత హైట్ పెరిగే అవకాశం ఉంది.