సంక్రాంతి వచ్చిందంటే తెలుగు రాష్ట్రాల్లో సినిమాల పండుగే. థియేటర్లలో సినిమాలు పోటీ పడుతుంటాయి. ప్రతి ఏడాది కొన్ని సినిమాలు పోటీ పడితే అందులో ఏది విన్నర్ అనేది పండగ తర్వాత తేలిపోతుంది. ఇక ఈసారి ఆసక్తికరమైన పోటీ ఉండనుంది. ఒకప్పుడు సంక్రాంతికి పోటీపడ్డ హీరోలే ఈసారి కూడా బాక్సాఫీస్ బరిలో దిగుతున్నారు.
2019 సంక్రాంతికి రామ్ చరణ్ హీరోగా నటించిన వినయ విధేయ రామ సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా తో పాటు బాలకృష్ణ హీరోగా నటించిన కథానాయకుడు.. విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన ఎఫ్ 2 సినిమాలు కూడా విడుదలయ్యాయి. ఈ సినిమాలలో వినయ విధేయ రామ ఫ్లాప్ అవ్వగా.. బాలకృష్ణ కథానాయకుడు సినిమా డిజాస్టర్ గా నిలిచింది. దీంతో 2019 కి వెంకీ మామ విన్నర్ గా నిలిచాడు. ఎఫ్ 2 సినిమాకు భారీ కలెక్షన్లు వచ్చాయి. ఏ సినిమా కూడా పోటీగా లేకపోవడంతో ఈ సినిమా వద్ద కోట్లు వసూలు చేసింది. అయితే ఈసారి సంక్రాంతికి మాత్రం పోటీ మరింత ఆసక్తికరంగా మారింది. దానికి కారణం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో హీరోగా నటించిన గేమ్ చేంజర్ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నెల 10వ తేదీన ఇంకేం సెంచరీ విడుదల కాబోతుంది. ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహించడంతో భారీ అంచనాలు ఉన్నాయి. అదే విధంగా బాలయ్య డాకూ మహారాజ్ పై కూడా అంచనాలు ఉన్నాయి. ఇక వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా కూడా విడుదల కాబోతుంది. ఇప్పటికీ ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీంతో ఈ మూడు సినిమాలలో విన్నర్ ఎవరు అన్నది ఆసక్తికరంగా మారింది. అంతేకాకుండా 2019లో వెంకీ మామ ఇద్దరు హీరోలను ఓడించగా ఈసారైనా బాలయ్య, రామ్ చరణ్, వెంకీ మామని ఓడిస్తారా అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.