రేవంత్ రెడ్డికి ఇక తిరుగులేదా..

Chakravarthi Kalyan

చెరవులను చెరబట్టి బడాబాబుల గుండెల్లో హైడ్రా దడ. చిన్నారులను మత్తులో ముంచుతున్న ఉన్నాదులపై కొరడా.. నాణ్యత పాటించని హోటల్ యాజమానులపై ఉక్కుపాదం.


అన్నీ ఏకకాంలో సర్కారు అంటే చురుకు పుట్టేలా తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం నలుగురి నోళ్లలో నానుతోంది. పది నెలలు పూర్తి చేసుకున్న కాంగ్రెస్ సర్కారు ఇక మీదట తన ముద్ర చూపే విధంగా అడుగులు వేస్తోంది. వాస్తవానికి డిసెంబరులోనే అధికారంలోకి వచ్చినా మధ్యలో లోక్ సభ ఎన్నికలతో రెండు నెలలు కోడ్ కింద పోయింది. ఆ గ్యాప్ తర్వాత ఇప్పుడు పూర్తి స్థాయిలో పాలనపై ఫోకస్ పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. 


ప్రకృతి అందించిన పెద్ద వనరు. అలాంటి వాటి సహజ ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తూ నిర్మాణాలు చేపడితే.. వరదలు ఊళ్లోకి వస్తున్నాయి. కానీ ఎవరేం చేస్తారులే అనుకుంటూ ఆక్రమణే ధ్యేయంగా పెట్టుకున్న బడా బాబులు హైదరాబాద్ లో చెరవులను చెరబట్టారు. హైదరాబాద్ కి తాగునీటికి ఒకప్పటి గుండెకాయలాంటి  గండిపేట  జలాశయం ఫుల్ ట్యాంక్ లెవల్ పరిధిలో ఓ కేంద్ర మంత్రి ఏకంగా పది ఎకరాలు కబ్జా చేశారు. ఇక గత ఆదివారం నుంచి ఇప్పటి వరకు గండిపేట, హిమాయత్ సాగర్ జంట జలాశయాలు పరిధిలో ఆక్రమణలకు పాల్పడ్డ పది నిర్మాణాలను కూల్చి వేశారంటే ఆశ్చర్యం కలగక మానదు.


ఇప్పుడు హైడ్రా ఎక్కడ దాడి చేస్తుందనే ఆందోళన అక్రమార్కుల్లో నెలకొంది. ఇక శనివారం సినీ హీరో నాగార్జున చెరువును ఆక్రమించి నిర్మాణం చేపట్టారనే ఆరోపణలపై చర్యకు దిగింది. అయితే ఈ నిర్మాణంపై బీఆర్ఎస్ హయాంలోనే ఆరోపణలు వచ్చినా.. కూల్చివేత ప్రయత్నాలు జరగలేదు. కానీ ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం చర్యలకు దిగింది.


హైదరాబాద్ అంటే బిర్యానీ ఫేమస్. అలాంటి బిర్యానీలు విక్రయించే రెస్టారెంట్లు నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదు. అన్నీ రెస్టారెంట్లు, హోటళ్లు కాకున్నా.. పేరున్న కొన్ని నాసిరకం నూనెలు, ఫ్రిజ్ లో ఉంచిన చికెన్, మటన్ వినియోగిస్తున్నట్లు తేలింది. దీంతో ఇప్పుడు ఫుడ్ సేఫ్టీ అధికారులు రంగంలోకి దిగారు. హైదరాబాద్ లోనే కాక రాష్ట్ర వ్యాప్తంగా దాడులు చేస్తున్నారు. కూల్చివేతలు, ఆహార భద్రతా తనిఖీలపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  ఇది ఇలా కొనసాగితే రేవంత్ కు మంచి పేరు రావడం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: