ఎన్ కన్వెన్షన్ కూలినా నాగ్ కు నష్టం లేదా.. అలా చేస్తే మళ్లీ నిర్మించుకోవచ్చా?
ఎన్ కన్వెన్షన్ సెంటర్ అక్రమ నిర్మాణం కాదని నాగ్ చెప్పుకొచ్చారు. అధికారులు ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేసిన నేపథ్యంలో తాను కోర్టును ఆశ్రయించి సమస్యను పరిష్కరించుకుంటానని నాగ్ తెలిపారు. అయితే ఎన్ కన్వెన్షన్ కూలినా నాగ్ కు నష్టం లేదని నాగార్జున మళ్లీ ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను నిర్మించుకోవచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ సెంటర్ మొత్తం విస్తీర్ణం ఏకంగా 10 ఎకరాల కంటే ఎక్కువ కాగా మిగిలిన స్థలంలో సరికొత్త హంగులతో ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను నిర్మిస్తే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఆక్రమణ స్థలాన్ని వదిలేసి మిగతా స్థలంలో నిర్మిస్తే భవిష్యత్తులో ఎన్ కన్వెన్షన్ కు సైతం ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మరోవైపు నాగార్జున కోర్టును ఆశ్రయిస్తే ఏం జరుగుతుందనే చర్చ కూడా మొదలైంది.
నాగార్జున కెరీర్ విషయానికి వస్తే నాగ్ ప్రస్తుతం కుబేర సినిమాతో బిజీగా ఉండగా నాగార్జున పారితోషికం ఒకింత భారీ స్థాయిలో ఉందని సమాచారం అందుతోంది. నాగార్జున ఇతర భాషల్లో సైతం తన సినిమాలు హిట్లుగా నిలిచేలా జాగ్రత్తలు తీసుకుని మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని నెటిజన్లు కోరుకుంటున్నారు. నాగ్ వెల్లడించిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. నాగార్జున ఒక్కో సినిమాకు 15 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం అందుకుంటున్నారని సమాచారం అందుతోంది. స్టార్ హీరో నాగార్జునను అభిమానించే అభిమానుల సంఖ్య ఊహించని స్థాయిలో పెరుగుతోంది.