సూపర్ స్టార్ మహేశ్ బాబు కెరీర్లో ‘పోకిరి’ సినిమా ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. 2006లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. మహేశ్‍కు ఎనలేని స్టార్ డమ్ తెచ్చిపెట్టింది. మాస్ హీరో ఇమేజ్‍ను తీసుకొచ్చింది. అప్పట్లో పోకిరి చిత్రం ఇండస్ట్రీ హిట్‍గా నిలిచి.. దుమ్మురేపింది. దర్శకుడు పూరి జగన్నాథ్ కెరీర్లోనూ ఈ చిత్రం హైలైట్‍గా నిలిచింది. ఈ సినిమాలో మహేశ్ యాక్టింగ్, డైలాగ్ డెలివరీ, స్టోరీ, క్లైమాక్స్ ట్విస్ట్ ఇలా అన్ని అంశాలు ప్రేక్షకులను విపరీతంగా మెప్పించాయి. ఆరంభం నుంచి పాజిటివ్ టాక్‍తో దుమ్మురేపింది. హౌస్ ఫుల్ కలెక్షన్లతో అదరగొట్టింది. ఈ చిత్రం టాలీవుడ్‍లో ఒకానొక ఐకానిక్‍గా నిలిచిపోయింది. మహేశ్ బాబు ఈ చిత్రంలో చేసిన పండు క్యారెక్టర్ కల్ట్‌గా నిలిచింది. దర్శకుడు పూరి జగన్నాథ్ రాసిన డైలాగ్స్ ఈ చిత్రానికి హైలైట్‍గా నిలిచాయి. ఇప్పటికీ ఈ పోకిరి డైలాగ్స్ వినిపిస్తూనే ఉంటాయి. పోకిరి సినిమా అప్పట్లో ఇండస్ట్రీ హిట్‍గా నిలిచింది. టాలీవుడ్‍లో హయ్యెస్ట్ కలెక్షన్లతో దుమ్మురేపింది. ఈ చిత్రం మొత్తంగా సుమారు రూ.70కోట్ల గ్రాస్ (సుమారు రూ.40 కోట్ల షేర్) కలెక్షన్లు దక్కించుకుంది. 2006లోనే రూ.70కోట్లను దక్కించుకొని ఆశ్చర్యపరిచింది. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్‍గా నిలిచింది. ఈ రికార్డును 2009లో మగధీర బ్రేక్ చేసింది. సుమారు రూ.12 కోట్ల బడ్జెట్‍తో రూపొందిన పోకిరి సినిమా రూ.70కోట్ల వసూలు చేసి దుమ్మురేపింది. ఈ చిత్రం ఏకంగా 200 థియేటర్లలో 100 రోజులను పూర్తి చేసుకుంది.పోకిరి చిత్రంలో మహేశ్ బాబుకు జోడీగా హీరోయిన్‍గా ఇలియానా నటించారు. ప్రకాశ్ రాజ్, నాజర్, ఆశిష్ విద్యార్థి, షాజాజీ షిండే, బ్రహ్మానందం, అలీ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. యాక్షన్‍తో పాటు ఈ చిత్రంలో బ్రహ్మానందం, అలీ కామెడీ కూడా బాగా పండింది.
పోకిరి చిత్రానికి మణిశర్మ ఇచ్చిన మ్యూజిక్ కూడా చాలా ప్లస్ అయింది. ఈ మూవీలోని పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ఇందిరా ప్రొడక్షన్స్, వైష్ణో అకాడమీ పతాకాలపై మంజుల ఘట్టమనేని, పూరి జగన్నాథ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీకి శ్యాం కే నాయుడు సినిమాటోగ్రఫీ చేయగా.. మార్తాండ్ కే వెంకటేశ్ ఎడిటింగ్ చేశారు.ఇదిలావుండగా టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో మణిశర్మ ఒకరు. చాలా మంది స్టార్ హీరోలకు సూపర్ హిట్ ఆల్బమ్స్ అందించిన ఘనత మణిశర్మది. చిరంజీవి, మహేష్, నాగార్జున లాంటి హీరోలకు మణిశర్మ ఫేవరిట్ మ్యూజిక్ డైరెక్టర్.ఇప్పుడు ఫామ్ తగ్గినప్పటికీ మణిశర్మ టాలీవుడ్ లో లెజెండ్రీ సంగీత దర్శకుడే.మహేష్ బాబు కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ పోకిరి చిత్రానికి సంగీతం అందించింది మణిశర్మనే. అయితే పోకిరి చిత్రం విషయంలో మణిశర్మ ఒక తెలివైన డెసిషన్ తీసుకున్నారట.పూరి జగన్నాధ్ పోకిరి చిత్ర కథ చెప్పగానే ఇది పెద్ద హిట్ అవుతుందని మణిశర్మ అంచనా వేశారట. వాస్తవానికి పోకిరి చిత్రం ఆ రేంజ్ హిట్ అవుతుందని ఎవరూ ఊహించలేదు. సినిమా రిలీజైన రెండు మూడు రోజుల వరకు బావుంది అనే టాక్ వచ్చింది కానీ.. బ్లాక్ బస్టర్ స్థాయిలో టాక్ వినిపించలేదు. మొదటి వారం గడిచే సరికి పోకిరి హీట్ యువతలో పెరిగిపోయింది.మహేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అయితే మణిశర్మ మాత్రం ఈ సక్సెస్ ని ముందే ఊహించారు. పూరి కథ చెప్పగానే.. ఈ చిత్ర చైన్నై ఏరియా థియేట్రికల్ రైట్స్ తనకి కావాలని అడిగారట. చైన్నై రైట్స్ ని ఆయన తీసుకున్నారు. భారీ స్థాయిలో లాభాలు అందుకున్నారు. అదన్నమాట మణిశర్మ తీసుకున్న తెలివైన బిజినెస్ డెసిషన్.