జూనియర్లకు ఛాన్స్ లేకుండా చేస్తున్న సీనియర్స్.. యంగ్ హీరోల పరిస్థితి ఏంటి..?

Pulgam Srinivas
ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగకు తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన స్థాయిలో సందడి కనిపిస్తూ ఉంటుంది. దానికి ప్రధాన కారణం ఎక్కువ శాతం స్టార్ హీరోలు నటించిన సినిమాలు సంక్రాంతి పండుగకు విడుదల అవుతూ ఉంటాయి. దానితో సంక్రాంతి పండుగ వచ్చింది అంటే చాలు తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన సందడి వాతావరణం కనబడుతూ ఉంటుంది. ఇకపోతే ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగకు టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలతో పాటు యంగ్ స్టార్ హీరోలు కూడా పోటీపడుతూ ఉండేవారు.

కానీ వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగకు మాత్రం ఎక్కువ సందడి సీనియర్ స్టార్ హీరోలదే కనబడే వాతావరణం ఉంది. ఎందుకు అంటే ఇప్పటికే టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న విశ్వంభర సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ చాలా రోజుల క్రితమే ప్రకటించారు. ఇక విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఓ మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాను కూడా వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.

ఇది ఇలా ఉంటే బాలకృష్ణ ప్రస్తుతం బాబి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ ని కూడా వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయాలి అని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. బాలయ్య కూడా వచ్చే సంవత్సరం సంక్రాంతి భరిలో ఉన్నట్లు అయితే వచ్చే సంవత్సరం సంక్రాంతి కి టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు అయినటువంటి చిరంజీవి ,  బాలకృష్ణ , వెంకటేష్ ముగ్గురే బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ పడే అవకాశం ఉంది. మరి యంగ్ హీరోలకు విరు అవకాశాన్ని ఇస్తారో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: