చరణ్ vs తారక్ : ఒకే కథాంశంతో వస్తున్న స్టార్ హీరోలు..

murali krishna
రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాతో అటు రామ్ చరణ్, ఇటు ఎన్టీఆర్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను సొంతం చేసుకున్నారు. అటు చరణ్ కెరీర్ కు ఇటు తారక్ కెరీర్ కు ఈ సినిమా ఎంతో ప్లస్ అయింది. ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉండగా రామ్ చరణ్ గేమ్ ఛేంజర్  సినిమాతో బిజీగా ఉండటం గమనార్హం. ఈ రెండు సినిమాలపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.యాదృచ్చికమో.. కాకతాళీయమో.. కొన్ని సినిమాలు ఒకేతీరులో ఉంటాయి. వాటి మధ్య పోలికలు ఒకేలా ఉన్నాయంటూ కొందరు విమర్శిస్తూ ఉంటారు కూడా. ఇక ఇందులో ఒక సినిమా హిట్ కావడం మరో సినిమా ఫ్లాప్ కావడం లాంటి ఆశ్చర్యకరమైన ఫలితాలు కూడా వస్తాయి. మరికొన్ని సార్లు రెండు మూవీస్ బంపర్ హిట్స్ కొడతాయి. ఇలాంటి పోలికే ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ అలాగే కోరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర మూవీ మధ్య ఒకే విధమైన పోలికలు ఉన్నాయంటున్నారు. మరి నిజంగానే ఈ రెండు సినిమాల మధ్య పోలికలు ఉన్నాయా?ఇప్పుడు ఇండస్ట్రీ మెుత్తం ఈ రెండు చిత్రాల గురించి ఓ విషయంలో చర్చించుకుంటున్నాయి. అదేంటంటే? రెండు సినిమాలు ఒకే విధమైన బ్యాక్ డ్రాప్ లో వస్తున్న చిత్రాలట. తండ్రి ఆశయం కోసం కొడుకులు పోరాడే కథే ఈ రెండు చిత్రాల్లో చూపించబోతున్నట్లు తెలుస్తోంది.
గేమ్ ఛేంజర్ లో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. మరోవైపు దేవర లో కూడా  తారక్ డబుల్ రోల్ లో కనిపించనున్నాడని తెలుస్తోంది. తండ్రీ కొడుకులుగా ఈ ఇద్దరు వారి వారి సినిమాల్లో కనిపించబోతున్నారు. ఈ రెండు మూవీల్లో తండ్రులు దగ్గరి వ్యక్తుల చేతుల్లో మోసపోవడం, వారిపై కొడుకులు పగ తీర్చుకోవడం ఉమ్మడి లక్షణంగా తెలుస్తోంది. దీన్ని బట్టే రెండు సినిమాల మధ్యలో పోలికలు ఉన్నాయని కొందరు అంటున్నారు. అయితే గేమ్ ఛేంజర్ పూర్తిగా పొలిటికల్ డ్రామా. ఇక దేవర విషయానికి వస్తే.. పూర్తిగా యాక్షన్ మూవీ. వేటికవే సెపరేట్.ఇదిలా ఉండగా.. తండ్రీని మోసం చేసిన విలన్స్ పై కొడుకులు పగ తీర్చుకోవడం అన్నది ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో వస్తున్న ట్రెండ్. కానీ దానిని స్క్రీన్ పై డైరెక్టర్ ఎలా ప్రజెంట్ చేశాడు అన్నదే ఇక్కడ కీలకాంశం. ఇప్పుడు దేవర-గేమ్ ఛేంజర్ రెండు సినిమాలు ఒకే సెటప్పులో వస్తున్నాయని కొందరు పేర్కొంటున్నారు. కాగా.. దేవర రెండు భాగాలుగా వస్తున్న విషయం తెలిసిందే. సెప్టెంబర్ 27న దేవర పార్ట్ 1 రిలీజ్ కానుంది. గేమ్ ఛేంజర్ ఇంకా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకోలేదు. మరి రెండు సినిమాల మధ్య పోలికలు ఉన్నాయి అంటూ వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: