ఇదేం దరిద్రం రా సామీ..ధురంధర్ 2 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయినా కూడా బాలీవుడ్ సైలెంట్..ఎందుకు?

Thota Jaya Madhuri
ఇటీవల బాలీవుడ్ మళ్లీ పుంజుకుని, వరుసగా భారీ కలెక్షన్లు సాధించే సినిమాలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే “ధురంధర్ 2” కూడా ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది. మొదటి భాగం విడుదలైనప్పుడే అది భారీ విజయాన్ని అందుకుని ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీంతో రెండో భాగంపై అంచనాలు అమాంతం పెరిగాయి. ఆ అంచనాలను మించి “ధురంధర్ 2” పాన్ ఇండియా స్థాయిలో అద్భుతమైన స్పందనను అందుకుని, యూనానిమస్ బ్లాక్‌బస్టర్ టాక్‌ను సొంతం చేసుకుంది.ఇలాంటి సమయంలో సాధారణంగా అన్ని ఇండస్ట్రీల నుంచి, ముఖ్యంగా బాలీవుడ్ నుంచి పెద్ద ఎత్తున అభినందనలు రావాలి. కానీ ఇక్కడ మాత్రం విరుద్ధ పరిస్థితి కనిపిస్తోంది. తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఈ సినిమాపై ప్రశంసలు కురిపించగా, హిందీ పరిశ్రమ నుంచి మాత్రం చాలా తక్కువ స్పందన రావడం చర్చనీయాంశమైంది.

కొద్ది మంది ప్రముఖులు మాత్రమే స్పందించారు. వారిలో రాకేష్ రోషన్, ప్రీతీ జింటా వంటి వారు ఈ సినిమాను అభినందించారు. అయితే మిగతా స్టార్ హీరోలు, దర్శకులు, ముఖ్యంగా ఖాన్ త్రయం వంటి ప్రముఖుల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం అభిమానుల్లో అనేక ప్రశ్నలకు దారితీస్తోంది. ఇది కేవలం యాదృచ్ఛికమా? లేకపోతే ఇండస్ట్రీల మధ్య ఉన్న పోటీ భావం కారణమా? లేక ఈ సినిమాను తమ స్థాయిలో అంగీకరించడానికి కొంత వెనుకంజ వేస్తున్నారా? అనే సందేహాలు కూడా సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు, ఒక మంచి సినిమా విజయాన్ని అందరూ కలిసి సెలబ్రేట్ చేయాల్సిన సమయంలో ఇలా మౌనం వహించడం సరైనదేనా అనే చర్చ కూడా మొదలైంది. సినిమా అనేది భాషలకతీతంగా ప్రేక్షకులను కలిపే మాధ్యమం. అలాంటి సందర్భంలో ఒక ఇండస్ట్రీ నుంచి వచ్చిన గొప్ప విజయాన్ని మరొక ఇండస్ట్రీ గుర్తించి ప్రోత్సహించడం అనేది ఎంతో అవసరం.ముందు రోజుల్లో బాలీవుడ్ నుంచి మరింత మంది ప్రముఖులు స్పందిస్తారా? ఈ భారీ విజయానికి తగిన గుర్తింపు వస్తుందా? అన్నది చూడాల్సి ఉంది. కానీ ప్రస్తుతం మాత్రం “ధురంధర్ 2” సాధించిన ఈ గొప్ప సక్సెస్ కంటే, దాని చుట్టూ నెలకొన్న ఈ నిశ్శబ్దమే ఎక్కువగా చర్చకు దారితీస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: