ఉస్తాద్ భగత్ సింగ్ మూడు రోజుల కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే.. మరి అంత తక్కువ..?

Divya
డైరెక్టర్ హరి శంకర్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో మార్చి 19వ తేదీన విడుదలైన రెండవ చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. పవన్ కళ్యాణ్ కి జోడిగా శ్రీలీల, రాశిఖన్నా మొదటిసారి నటించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను సంపాదించుకుంది. ఇక కలెక్షన్స్ పరంగా కూడా మూడు రోజులలో రూ. 63.08 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు తెలుస్తోంది. మొత్తం మీద రూ. 53.09 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్స్ రాబట్టింది.


ఉస్తాద్ భగత్ సింగ్ శనివారం 36% వరకు ఆక్యుఫెన్సీ తో బుకింగ్ అవ్వగా రూ. 9.15 కోట్ల రూపాయలు రాబట్టింది. అయితే దురంధర్2 చిత్రం ఉగాది కానుకగా  మార్చి 19న విడుదల కాగా ఈ సినిమాకి ఉన్న బజ్ వల్ల తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమాకీ బ్రహ్మరథం పడుతున్నారు. ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం ప్రధాన నగరాలలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి  50% లోపు మాత్రమే ఆక్యుఫెన్సీ నమోదవుతున్నాయి. దురంధర్ 2 చిత్రానికి ఏ మరియు బి సెంటర్లలో 75% పైగా ఆక్యుపెన్సి తో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. దురంధర్ 2 మూడు రోజులకి రూ.500 కోట్ల గ్రాస్ దిశగా దూసుకుపోతోంది.



పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా సాంకేతిక నిపుణులతో అన్ని కలిపి ఈ సినిమా బడ్జెట్ సుమారుగా రూ.150 కోట్ల రూపాయల వరకు అయినట్లు వినిపిస్తున్నాయి. ఫ్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే నైజాం థియేటర్ రైట్స్ 50 కోట్లు, ఏపీ థియేటర్రికల్ రైట్స్ రూ.54 కోట్లు, సిడేట్  రూ.16 కోట్లు ఇలా మొత్తం కలుపుకొని రూ .120 కోట్ల వరకు రిలీజ్ బిజినెస్ జరిగింది. ప్రపంచవ్యాప్తంగా రూ .137 కోట్ల బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే రూ.140 కోట్లు రాబట్టాలి అలాగే రూ.280 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ ని కూడా వసూలు చేయాలి ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూస్తూ ఉంటే అంత రాబట్టడం కష్టమే అన్నట్టుగా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: