సైమా 2024:12 వ ఎడిషన్ బెస్ట్ సౌత్ ఇండియన్ చిత్రాలు ఇవే..!

Divya
సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డు సైమా 12వ ఎడిషన్ బెస్ట్ సౌత్ సినిమా అవార్డులను సైతం ఇచ్చేందుకు తాజాగా సిద్ధమైనట్టుగా తెలుస్తోంది..sima 2024,2023 లో విడుదలైన చిత్రాలకు సంబంధించి నామినేషన్లను ప్రకటించడం జరిగింది.. సైమా 2024 ఈవెంట్స్ సెప్టెంబర్ 14 మరియు 15 తేదీలలో దుబాయ్ లో జరగబోతున్నాయట.. దీనిని సైమా చైర్ పర్సన్ బృందాప్రసాద్ చేయబోతున్నారు. అలాగే 2023 లో విడుదలైన సైమా నామినేషన్లను కూడా ప్రకటించడం జరిగింది. ఈ విషయం పైన బృందాప్రసాద్ మాట్లాడుతూ గత రెండేళ్లుగా దక్షిణాది భారతీయ చలనచిత్ర నిర్మాతలు భాషను అవరోధిగా అధిగమించారు అంటూ తెలిపారు.

2024లో సైమా బలమైన పోటీ నెలకొంది.. టాలీవుడ్ నుంచి దసరా.. కోలీవుడ్ నుంచి జైలర్.. కన్నడ నుంచి కాటేరా.. మలయాళం నుంచి 2018  వంటి సినిమాలు సైమా నామినేషన్ లో ముందు ఉన్నాయి.. తెలుగులో నాని కీర్తి సురేష్ జంటగా నటించిన దసరా సినిమా 11 నామినేషన్లతో ముందు ఉండగా.. నాని, మృనాణ్ ఠాకూర్ జంటగా నటించిన హాయ్ నాన్న సినిమా 10 నామినేషన్లతో రెండవ స్థానంలో ఉన్నట్లు తెలుస్తోంది.. అలాగే రజనీకాంత్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన జైలర్ సినిమా 11 నామినేషన్లు ముందు ఉన్నది.

ఉదయనిది స్టాలిన్, కీర్తి సురేష్ జంటగా నటించిన మాయాన్నన్ సినిమా 9 నామినేషన్లు రెండవ స్థానంలో ఉన్నది.. అలాగే కన్నడలో దర్శన్ హీరోగా నటించిన కాటేరా సినిమా 8 నామినేషన్లతో ముందులో ఉన్నది.. రక్షిత్ శెట్టి నటించిన సప్త సాగరదాచే ఎల్లో - సైడ్ ఎ సినిమా 7 నామినేషన్లతో దగ్గరగా ఉన్నది.. అలాగే మలయాళంలో దావీనో థామస్ నటించిన 2018 సినిమా 8 నామినేషన్లతో ముందు ఉన్నది.. అలాగే జ్యోతిగా మమ్ముట్టి నటించిన కథల్ - ది కోర్ సినిమా 7 నామినేషన్లతో ఉన్నది. ఇక ఆన్లైన్ ఓటింగ్ విధానం ద్వారా విజేతలను సైతం ఎంపిక చేయబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: