కేసీఆర్, కేటీఆర్ ను దెబ్బకొట్టేలా హరీష్ రావు బిగ్ స్కెచ్.?

Pandrala Sravanthi
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత దాదాపు రెండు పర్యాయాలు కేసీఆర్ పాలన చేశారు. ఈయన పాలనలో కేవలం కేసీఆర్, కేటీఆర్ కవిత, మాత్రమే రాష్ట్రం మొత్తం బాసులుగా ఉన్నారు. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కేసీఆర్, కేటీఆర్ అని చెప్పవచ్చు. కేసీఆర్ రెండు పర్యాయాలు పాలన చేసిన సమయంలో నేనే రాజు నేనే మంత్రి అనే విధంగా ప్రవర్తించారు. అంతేకాకుండా కేసీఆర్ అంతటి పేరు సంపాదించుకున్న హరీష్ రావును ఎలాగైనా డమ్మీ చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. చివరికి అన్ని విఫలమై తన అధికారాన్ని కోల్పోయాడు. అంతేకాకుండా కనీసం పార్లమెంటు ఎలక్షన్స్ లో ఒక్క సీటైన వస్తుందంటే అది కూడా రాలేదు. దీనికి ప్రధాన కారణం కేసీఆర్ కుటుంబ పాలన మరియు ఆయనకు ఉన్నటువంటి అహంకార ధోరణి.
ఆయన ప్రజలనే కాకుండా నాయకులను కూడా చిన్నచూపు చూసేవారట. వారికి అపాయింట్మెంట్ కూడా ఇచ్చేవారు కాదట. ఈ విధంగా బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా  నాశనం అయ్యేలా చేశారు.  ఇక కేసీఆర్ పాలన నచ్చనటువంటి ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కట్టారు. 2023ఎన్నికల్లో  కాంగ్రెస్ మంచి మెజారిటీతో గెలుపొందితే, బీఆర్ఎస్ పార్టీకి 39 సీట్లు వచ్చాయి.    కానీ ఈ ఎమ్మెల్యేలను కూడా కాంగ్రెస్ ఒక్కొక్కరిగా  వారి పార్టీలో చేర్చుకుంటుంది. అంతేకాకుండా అందులో నుంచి కంటోన్మెంట్ ఎమ్మెల్యే మరణించింది. అక్కడ కూడా కాంగ్రెస్ విజయం సాధించింది. ఇప్పటికే దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి,  కడియం, డాక్టర్ సంజయ్ కుమార్ వంటి వారు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
ఇలా చూస్తూ ఉండగానే బీఆర్ఎస్ పూర్తిగా లేకుండా పోయే పరిస్థితి ఏర్పడింది. ఇదే తరుణంలో హరీష్ రావు సరికొత్త ప్లాన్ గియ్యబోతున్నారట. కేసీఆర్, కేటీఆర్ ను ప్రజలు, నాయకులు నమ్మే పరిస్థితి లేదు. ఆ ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకొని బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా తన చేతుల్లోకి తీసుకొని, రాబోవు కాలంలో తెలంగాణలో బీఆర్ఎస్ ఉంటుంది అనే భరోసా ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారట. అలా కావాలి అంటే తప్పకుండా బిఆర్ఎస్ పూర్తిగా హరీష్ రావు వశం కావాలి. అలా అయితేనే ఎమ్మెల్యేలు ఏ పార్టీలోకి వెళ్లకుండా ప్రభుత్వం చేసే వైఫల్యాలను ఎండగడుతూ ముందుకు వెళ్తారు. అందుకే బీఆర్ఎస్ లో ఉన్నటువంటి మొత్తం 30 మంది ఎమ్మెల్యేలను హరీష్ రావు తన వైపు తిప్పుకొని, సమర్థవంతమైన నాయకత్వం వహిస్తానని భరోసా వారికి ఇచ్చి పార్టీని తన చేతిలోకి తీసుకునే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: