వైసీపీ నేతల ఆటకట్టించాలంటే పట్టాభిరామ్ కు ఆ పదవి ఇవ్వాల్సిందే..?

murali krishna
*టీడీపీ ఫైర్ బ్రాండ్ గా ఎదిగిన పట్టాభి రామ్
*పార్టీ బలోపేతంలో పట్టాభి రామ్  కీలక పాత్ర
*మరి ఈ సారి నామినేటెడ్ పదవి దక్కేనా ..?
 ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి (NDA alliance) ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో టీడీపీ -135 , జనసేన- 21, బీజేపీ - 8 సీట్లతో తిరుగులేని విజయం సాధించాయి..ఈ ఎన్నికల్లో వైసీపీ కేవలం11 సీట్లు సాధించి ఘోర ఓటమి చవిచూసింది. ఈ ఫలితాలతో వైసీపీకి కొమ్ముకాసిన అధికారుల్లో భయం మొదలైంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వైసీపీ కార్యకర్తలు టీడీపీ కార్యాలయాలపై చేసిన దాడి ఇప్పటికి గుర్తుండే ఉంటుంది.కూటమి ప్రభుత్వం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న తెలుగు తమ్ముళ్లు వైసీపీకి కొమ్ముకాసిన నాయకులపై కొరడా జుళిపిస్తున్నారు.అయితే టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి అయిన కొమ్మ రెడ్డి పట్టాభి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.గత వైసీపీ ప్రభుత్వ అక్రమాలను తన వాగ్ధాటితో ఎంతగానో ప్రశ్నించారు.వైసీపీ పై ప్రశ్నల వర్షం కురిపిస్తూ టీడీపీ ఫైర్ బ్రాండ్ గా ఎదిగారు.

ఒకానొక సమయంలో వైసీపీ నేతలు ఆయనపై అక్రమ కేసులు కూడా పెట్టడం ఆయన అరెస్ట్ కావడం కూడా జరిగింది.అలాగే అప్పటి కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా అక్రమ కేసులు బనాయించి థర్డ్ డిగ్రీ ప్రయోగించారని పలుమార్లు తన ఆవేదనను వ్యక్తం చేశారు. అయిన కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఆయన ఎంతో ధీమాగా వున్నారు.టీడీపీ పై వైసీపీ నేతల విమర్శలకు తన మాటల వాగ్ధాటితో పట్టాభి రామ్ ఎంతో ధీటుగా సమాధానం ఇస్తారు.అలాంటి వ్యక్తికి నామినేటెడ్ పదవి ఇస్తే బాగుంటుంది టీడీపీ నేతలలో చర్చలు మొదలయ్యాయి.అయితే టీడీపీ ,బీజేపీ ,జనసేన కూటమిలో భాగంగా సీటు లభించని నేతలకు నామినేటెడ్ పదవులు ఇస్తామని ఎన్నికలకు ముందు చంద్రబాబు ,పవన్ కళ్యాణ్ మాట ఇచ్చారు.ఇచ్చిన మాట ప్రకారం చాలా మంది ఆశావహులు నామినేటెడ్ పదవుల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.మరి పట్టాభి రామ్ కు నామినేటెడ్ పదవి దక్కుతుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: