సజ్జలభార్గవ్ కు షాక్ ఇచ్చిన జగన్..?

FARMANULLA SHAIK
ఏపీలో ఈ ఎన్నికల్లో వైసీపీ పార్టీ భారీ ఓటమి చెందడంతో జగన్ పార్టీ భవిష్యత్తుపై కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.ప్రస్తుతం పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పార్టీని ప్రక్షాళన చేసే పనిలో ఉన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసి నిజాయతీగా ఉంటున్న వారిని తన వద్దే ఉంచుకుని పార్టీకి ఏమీ చేయకుండా నష్టం కలిగించేవారిని పక్కనపెడుతున్నారు.సజ్జల వ్యవహారానికి వస్తే.. ప్రభుత్వంలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా.. ఎవరికైనా పోస్ట్ కేటాయించాలన్నా.. చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి అధికారుల వరకు బదిలీ చేయాలన్నా సజ్జల అనుమతి కావాల్సిందే.. ఉపాధ్యాయులు, ఉద్యోగులు, అంగన్వాడీలు, ఆశ వర్కర్స్.. ఇలా ఎవరితో చర్చలు జరిగిన. ప్రతి సందర్భంలోనూ సజ్జల వీరు ఎవరు తమ ఓటు బ్యాంకు కాదని కించ పరిచే విధంగా మాట్లాడేవారు. ఈ మాటలే ఎన్నికల్లో రిఫ్లెక్ట్ అయ్యాయి. సజ్జల మాటలకు అనుగుణంగా.. వైసీపీ డిజిటిల్‌ మీడియా క్యాంపెయిన్ ఉండేది.. వారిని కించపరుస్తున్నట్లుగా పోస్టులు ఉండేవి. అన్ని కలిపి ఏమైంది సీట్ల సంఖ్య 151 నుంచి 11కు పడిపోయింది.

వైసీపీ సోషల్ మీడియా వింగ్ ను తన పుత్రరత్నం సజ్జల భార్గవరెడ్డికి అప్పగించారు. సోషల్ మీడియా చేతిలో పెట్టుకుని ఇష్టారీతిగా చెలరేగిన భార్గవ్ పార్టీ పరాజయం పాలైన తొలి రోజే అంటే ఫలితాలు వెలువడుతుండగానే అజ్ణాతంలోకి వెళ్లిపోయారు. అయితే భార్గవ్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ సోషల్ మీడియా వింగ్‌ని చూసుకుంటూ ఉండేవాడు. అయితే ఇప్పుడు ఆ పని నుంచి భార్గవ్‌ను తప్పించినట్లు తెలుస్తోంది. ఆ స్థానంలో నరసారావు పేటకు చెందిన నాగార్జున యాదవ్‌ను నియమించాలని జగన్ నిర్ణయం తీసుకున్నారట. ఎన్నికల సమయంలో తెలుగు దేశం, జనసేన పార్టీలు వైఎస్సార్ కాంగ్రెస్‌పై చేస్తున్న తప్పుడు ప్రచారాలను తిప్పి కొట్టడంలో భార్గవ్ రెడ్డి విఫలమయ్యాడని జగన్ అభిప్రాయపడుతున్నారట.సజ్జల భార్గవ్ రెడ్డి నిర్వాకం వల్ల పార్టీ సోషల్ మీడియాలో చెల్లించాల్సిన బిల్లులు కోట్ల రూపాయలలో ఉన్నాయనీ, అలాగే పార్టీకి సంబంధించిన ఆర్థిక పరమైన విషయాలెన్నో సజ్జల రామకృష్ణారెడ్డితో ముడిపడి ఉండటంతో ఇప్పుడు వైసీపీ హైకమాండ్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.భార్గవ్ రెడ్డి పార్టీ ఫండ్స్‌ని దుర్వనియోగం చేసి ఇన్‌ఫ్లుయెన్సర్లకు లక్షల్లో కట్టబెట్టాడని.. కానీ వారి వల్ల పార్టీకి ఒరిగింది ఏమీ లేదని జగన్ అన్నట్లు తెలుస్తోంది. గురువారం జరగబోయే సమావేశానికి ఎవరెవరు హాజరువుతున్నారో తెలిసిపోతుందని.. ఒకవేళ హాజరుకాని వారు ఎవరైనా ఉంటే వారు వేరే పార్టీల్లోకి జంప్ అవ్వాలని ప్రయత్నిస్తున్నారని అనుకోవాలని పార్టీ వర్గాలు అంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: