"చెప్పుతో కొట్టిన్నట్లు ఆన్సర్ ఇచ్చిన సమంత ".. తగలాల్సిన వాళ్లకే బాగా తగిలిందిగా..!
కాగా మరికొద్ది రోజుల్లోనే నాగచైతన్య హీరోయిన్ శోభిత ధూళిపాళ్లను రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు . దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియా మొత్తం నాగచైతన్య - సమంత డివోర్స్ విషయమే హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుంది . నిజంగా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించుకుంటే వీళ్లు ఎందుకు విడిపోతారు..? అసలు నాగచైతన్య సమంతను ప్రేమించుంటే శోభిత ధూళిపాళ్లతో పెళ్లికి ఎందుకు సిద్ధమవుతాడు ..?అంటూ రకరకాలుగా మాట్లాడుకున్నారు .
అంతేకాదు సమంత త్వరలోనే రెండో పెళ్లి చేసుకోబోతుంది అంటూ కూడా ఘాటుగా కామెంట్స్ చేశారు. అయితే అలాంటి వాళ్ళకి చెప్పుతో కొట్టినట్లు ఆన్సర్ ఇచ్చింది సమంత. సిటాడిల్ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంతకు తమ రెండో పెళ్లిపై ప్రశ్న ఎదురైంది . అంతేకాదు సమంత ప్రశ్నకు చాలా చాలా బోల్డ్ గా ఆన్సర్ ఇచ్చింది. ఈ ఒక్క ఆన్సర్ తో సమంత పై గౌరవం మరింత పెరిగిపోయింది అంటున్నారు సమంత ఫ్యాన్స్ . సమంత ఏమనిందంటే .."తాను ప్రేమించి ఇష్టపడి వివాహం చేసుకున్నాను అని.. కానీ ఇప్పుడు విడిపోయామని.. జీవితంలో రెండో వివాహం గురించి అసలు ఆలోచించట్లేదని తనకు మరో వ్యక్తి అవసరం కూడా లేదు అని స్పష్టంగా చెప్పేసింది". ఆత్మవిశ్వాసంతో ఆమె ఇచ్చిన సమాధానం ప్రేక్షకులను బాగా అలరించింది. అంతేకాదు సమంత లాగే ఉండాలి అమ్మాయిలు అంటూ చాలామంది ప్రశంసిస్తూ ఉండడం గమనార్హం..!!