చంద్ర బాబు: ముందున్న సవాళ్లు ఇవే.. ఎదుర్కోగలరా..?

Divya
ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి చాలా ఇబ్బందులు ఎదురవుతాయనే వార్తలు వినిపిస్తున్నాయి.ముఖ్యంగా కూటమిలో భాగంగా పలు రకాల హామీలను ప్రకటించినప్పటికీ అవి అమలు చేయడంలో చాలా కష్టం అని చెప్పవచ్చు. అనుకున్నట్టుగానే ఇప్పుడు ఇలాంటి పరిస్థితి కూటమికి ఏర్పడింది. ముఖ్యంగా పింఛన్ పెంపు విషయం పైన కీలకమైన నిర్ణయం తీసుకొని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ.. వీటి ఖర్చు సుమారుగా 4000 రూపాయల కోట్ల రూపాయల ఖర్చు జూలై నెలకి ఉండాల్సి ఉన్నది.

దాదాపుగా 66 లక్షల మంది అన్ని సామాజిక కేటగిరీల పెన్షన్లలో ఉన్నారు. ఇక అలాగే కూటమి అధికారంలోకి వస్తే ఒకటవ తారీఖున ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తామని చెప్పారు. అనుకున్నట్టుగానే మరో కొద్ది రోజులలో ఒకటవ తారీఖు కూడా రాబోతోంది సుమారుగా దీని ఖర్చు 6000 కోట్ల రూపాయలకు పైగానే ఉంటుందట. ఈ రెండు కలుపుకోగానే ఇప్పుడు ఏకంగా 11 వేల కోట్లకు పైగా ఖర్చు చేయవలసి ఉన్నది. అలాగే సూపర్ సిక్స్ హామీలు మాట ఉన్నది. ఇందులో రైతులకు 20వేల రూపాయలు ప్రతి ఏడాది ఇస్తామని ముఖ్యంగా అమ్మఒడి కింద 15 వేల రూపాయలు ప్రతి విద్యార్థికి ఇస్తామని.. ముఖ్యంగా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు ఇస్తామని తెలిపారు.
వీటితోపాటు 18 నుంచి 59 ఏళ్ల లోపు ఉన్న ప్రతి మహిళలకు 1500 ఇస్తామని ,ఉచిత బస్సు ప్రయాణం మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ . ఇలాంటివన్నీ కూడా మేనిఫెస్టోలో పెట్టారు. ఇవన్నీ చేయాలి అంటే కచ్చితంగా తక్షణ ఒక సంపాదన సృష్టించాలి. ఈ సమయంలో ఇలాంటివి చేయడం అసలు కుదిరే పనా అంటూ పలువురు నేతలు తెలియజేస్తున్నారు. మరి ఇలాంటి సవాల్ అన్నిటిని కూడా చంద్రబాబు అధికమించి మరి ముందుకు వెళతారా లేదా అనే విషయం తెలియాల్సి ఉన్నది. చంద్రబాబుకు అసలు శిష్యులైన పరీక్ష సమయం ఇదే అంటూ పలువురు నేతలు కూడా తెలియజేస్తున్నారు.  గత ప్రభుత్వం చేసిన అప్పులు తీరాలి అంటే సుమారుగా రెండేళ్లపాటు పడుతుందని టిడిపి నేతలు సైతం వెల్లడిస్తున్నారు. మరి ఇలాంటి సమయంలో మేనిఫెస్టోలో పెట్టినవి నెరవేరుస్తారో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: