ఏపీ: సినీ ఇండస్ట్రీ అభివృద్ధి ఏంటో చూపిస్తా..మంత్రి కందుల..!

Divya
సినిమా రంగానికి, రాజకీయాలకు ఎంతో మంచి అనుబంధం ఉన్నది. అందుకే చాలామంది సెలబ్రిటీలు కూడా రాజకీయ నాయకులకు సపోర్టుగా నిలుస్తూ ఉంటారు. మరి కొంత మంది పార్టీలు కూడా పెడుతూ ఉంటారు. అలా జనసేన పార్టీని స్థాపించి ఎప్పుడో అయినప్పటికీ.. 2024 లో మంచి విజయాన్ని అందుకున్న పవన్ కళ్యాణ్ మంత్రులను కూడా చేశారు. జనసేన మంత్రి కందుల దుర్గేష్ కు సినిమాటోగ్రఫీ, ఏపీ పర్యటక, సాంస్కృతిక వంటి వాటిని కేటాయించడం జరిగింది. ఆ తర్వాత కందుల దుర్గేష్ మాట్లాడుతూ తనకు కేటాయించిన శాఖలు ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన చేస్తానట్టు మంత్రి తెలియజేశారు.

ఆంధ్రప్రదేశ్ ను టూరిజం హబ్ గా చేస్తామని పరిపాలన కూడా అందించడమే కాకుండా అభివృద్ధి చేస్తామని కక్ష సాధింపు చర్యలకు అసలు పాల్పడమని చట్టపరంగానే తప్పు చేసినవారికి శిక్షిస్తామని  తెలియజేశారు మంత్రి కందుల దుర్గేష్.. ఇక రెడ్ బుక్కు కచ్చితంగా ఉంటుంది అంటూ వ్యాఖ్యానించారు. ఉన్నతాధికారుల సైతం అవినీతి అక్రమాలతో పాల్పడితే ఎవరైనా సరే చట్ట పర్యంగానే చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. నిడదవోలుతో పాటు పిఠాపురం అభివృద్ధికి కూడా ప్రత్యేకమైన శ్రద్ధలు తీసుకుంటామని తెలిపారు జనసేన మంత్రి.

నిడదవోలు ప్రజలకు అందుబాటులో ఉంటానని కూడా తెలియజేశారు. అలాగే రాష్ట్రంలో ఎందుకు అభివృద్ధి వెనుకబడింది అని ప్రశ్నించగా కేవలం బటన్ నొక్కడానికి పరిమితమయ్యారంటూ కూడా విమర్శించారు..విధి విధానాలే తమ గెలుపుకు కారణమని వెల్లడించారు. జనసేన మంత్రి కందుల దుర్గేష్.. అలాగే ఈవీఎంల పైన జగన్ చేసిన వ్యాఖ్యలు చాలా విడ్డూరంగా ఉన్నాయని కూడా వెల్లడించారు. ఈవీఎంల పైన వ్యాఖ్యలు అంటే ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేకపోవడమే అన్నట్లుగా వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ పర్యటన సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ కందుల దుర్గేష్ ప్రస్తుతం బాధ్యతలు చేపడుతున్నారు మరి ఏ మేరకు సిని ఇండస్ట్రీని అభివృద్ధి చేస్తారు చూడాలి మరి. మరి ఈ విషయంపై వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: