అందరి ముందే హత్యా.. పోలీసులేం చేస్తున్నారు.. రేవంత్‌ రెడ్డి సీరియస్‌?

Chakravarthi Kalyan
నారాయణపేట, పెద్దపల్లి జిల్లాల్లో జరిగిన ఘటనలపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలంలో సంజీవ్ హత్య ఘటనపై తీవ్రంగా స్పందించాలని డీజీపీకి సీఎం ఆదేశాలు జారీ చేశారు. నిన్న దాయాదాలు పొలం తగాదాలో ఓ వ్యక్తిని చుట్టుముట్టి కర్రలతో కొట్టి చంపిన వీడియో వైరల్‌ అయ్యింది. అరాచకాలు, హత్యలకు పాల్పడే వారెవరైనా ఉపేక్షించ వద్దన్న సీఎం.. ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలితే బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.


ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి సీఎం ఆదేశాలు జారీ చేశారు. పెద్దపల్లి జిల్లాలో ఆరేళ్ల బాలికపై అత్యచారం, హత్యపైనా తీవ్రంగా స్పందించిన సీఎం.. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలని పోలీసులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తగిన న్యాయం చేస్తుందని సీఎం భరోసా ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: