షాకింగ్ కృష్ణుడు గా నాని అర్జునుడు గా విజయ్ దేవరకొండ !

Seetha Sailaja
ప్రస్తుతతరం హీరోలలో పురాణ పాత్రలు చేయడానికి ఏహీరో సాహసం చేయడంలేదు.  కొంతవరకు బాలయకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ లు ఇలాంటి పాత్రలు చేసి కొంతవరకు పేరు ప్రఖ్యాతులు సంపాధించుకున్నప్పటికీ వారిద్దరు కూడ ఎక్కువగా మాస్ సినిమాలను చేయడానికి ఆశక్తి కనపరుస్తున్నారు.

ఇలాంటి పరిస్తుతుల్లో మీడియం రేంజ్ హీరోలుగా అగ్ర స్థానంలో కొనసాగుతున్న నాని విజయ్ దేవరకొండ లు శ్రీకృష్ణుడు అర్జునుడు పాత్రలలో నటిస్తున్నారు అన్న వార్తా ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది. తెలుస్తున్న సమాచారంమేరకు ఈ నెలాఖరున వడుదల కాబోతున్న ‘కల్కి 2898’ మూవీలో నాని కృష్ణుడిగా విజయ్ దేవరకొండ అర్జునుడిగా ఆ మూవీలో అతిధి పాత్రలలో కొంతసేపు కనిపిస్తారని వార్తలు వస్తున్నాయి.

ఈసినిమా కథ ద్వాపర యుగం నుండి కలియుగం వరకు నడిచే నేపధ్యంలో ఈమూవీ కథలో పురాణ పాత్రల ఛాయలతో ఉన్న కృష్ణుడు అర్జునుడు పాత్రలలో వీరిద్దరూ ఇలా కనిపస్తారని టాక్. ఈవిషయానికి సంబంధించి అసలు విషయం తెలియాలి అంటే ఈ మూవీ విడుదలయ్యే జూన్ 27 వరకు వేచి చూడాలి. ఈసినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపధ్యంలో కేవలం ప్రభాస్ అభిమానులు మాత్రమే కాకుండా సినిమా అభిమానులు అంతా ‘కల్కీ’ మూవీ విడుదల గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

లేటెస్ట్ గా విడుదలైన ఈమూవీ ట్రైలర్ కు మంచి స్పందన వచ్చినప్పటీకీ ఈ మూవీ కథ ఎంతవరకు బిసి సెంటర్లలోని మాస ప్రేక్షలకు ఎంతవరకు అర్థం అవుతుంది అన్న విన్న సందేహాలు కొందరికి వస్తున్నాయి. అయితే ప్రస్తుతం ప్రభాస్ కు కొనసాగుతున్న మాస్ ఇమేజ్ తో ‘కల్కి’ మూవీ ఓపెనింగ్ కలక్షన్స్ టాలీవుడ్ కలక్షన్స్ రికార్డులను తిరగ వ్రాస్తుందని డార్లింగ్ అభిమానులు ఎంతో ఆశతో ఉన్నారు. అందుతున్న సమాచారం ప్రకారం ఈమూవీ మొదటి వారంలో ప్రపంచ వ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూలు చేస్తుందని ప్రభాస్ అభిమానులు గంపేడు ఆశలతో ఉన్నారు..    


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: