కష్టాల్లో కేసీఆర్‌ కుటుంబం..కేటీఆర్‌కు నోటీసులు?

Veldandi Saikiran
తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత కల్వకుంట్ల చంద్రశేఖర రావు కుటుంబం కష్టాల్లో కూరుకుపోయింది. 10 సంవత్సరాలు అధికారాన్ని తెలంగాణ రాష్ట్రంలో కోల్పోవడం.... ఆ తర్వాత బాత్రూంలో కెసిఆర్ జారి పడటం... అనంతరం ఆసుపత్రి పాలు కావడం వరుసగా జరిగాయి. ఇటు అధికారం పోవడంతో గులాబీ పార్టీని కీలక నేతలు అందరూ వీడుతున్నారు. కడియం శ్రీహరి, నాగేందర్ లాంటి ఎమ్మెల్యేలు కూడా జారిపోయారు.

అటు కెసిఆర్ కూతురు కల్వకుంట్ల కవిత లిక్కర్ స్కామ్ లో జైలు పాలయ్యారు. మొన్న జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో... గులాబీ పార్టీ చరిత్రలో జరగని పరాజయం  చోటు చేసుకుంది. అటు ఫోన్ టాపింగ్,  కాలేశ్వరంలో స్కాం, ఈడి దాడులు, గొర్రెల కొనుగోళ్లలో అక్రమాలు  అంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం... కెసిఆర్ ను బాగా ఇబ్బంది పెడుతోంది. ఇలాంటి నేపథ్యంలో గులాబీ బాస్ కల్వకుంట్ల చంద్రశేఖర రావు  తనయుడు కేటీఆర్ కు ఊహించని షాక్ తగిలింది.

తాజాగా కేటీఆర్ కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కేటీఆర్ ఎన్నికను సవాల్ చేస్తూ సిరిసిల్ల కాంగ్రెస్ అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి, లగ్సిటి శ్రీనివాసులు వేరువేరుగా ఎన్నికల పిటిషన్లు దాఖలు చేయడం జరిగింది. అయితే ఈ సందర్భంగా కేటీఆర్ తో పాటు ఎన్నికల అధికారులకు, సిరిసిల్ల ఆర్వోలకు నోటీసులు జారీ చేసింది తెలంగాణ హైకోర్టు. సిరిసిల్ల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కేటీఆర్ గెలిచిన సంగతి తెలిసిందే.  అయితే ఎన్నికల నామినేషన్ సందర్భంగా... కేటీఆర్ చూపించిన లెక్కలు తప్పుగా ఉన్నాయట.

అఫిడవిట్ లో.. తన ఆస్తుల వివరాలు సరిగా పొందుపరచలేదట కేటీఆర్. హిమాన్షు పేరుతో ఆస్తులు ఎలా వచ్చాయని... పిటిషన్లు హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల సమయంలో మైనర్ గా ఉన్న... కేటీఆర్ కొడుకు హిమాన్షు పేరుపైన 36 ఎకరాలు ఉన్నాయని... దానికోసం దాదాపు కోటి రూపాయలు ఖర్చు చేశాడని పిటిషన్లు తెలిపారు. ఆ డబ్బంతా ఎక్కడిది..? అనే వివరాలను తెలపాలని పిటిషన్ లో పిటీషనర్లు తెలిపారు. అయితే ఈ కేసును విచారించిన హైకోర్టు... నాలుగు వారాల్లో వివరణ ఇచ్చేందుకు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించి.... నోటీసులు ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: