కల్కితో డార్లింగ్ కి బాహుబలి వైబ్స్ మళ్ళీ వస్తాయంటారా?

Purushottham Vinay
ప్రస్తుతం ప్రభాస్ కి మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎంత ఉందో అంతకంటే ఎక్కువగానే ఫ్యామిలీ ఆడియన్స్ లో కూడా ఫాలోయింగ్ ఉంది. ప్రభాస్ నుంచి వచ్చిన ఛత్రపతి, డార్లింగ్, మిస్టర్ పర్ ఫెక్ట్, బాహుబలి సిరీస్ లు అతనికి ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఫాలోయింగ్ బాగా పెరిగేలా చేశాయి.ప్రభాస్ నుంచి మూవీ వస్తుందంటే చాలు అన్ని వర్గాల వారికి నచ్చుతుందనే అభిప్రాయం ప్రస్తుతం ఏర్పడింది. అయితే ప్రభాస్ కి బాహుబలి 2 సినిమా తర్వాత ఆ స్థాయిలో బ్లాక్ బస్టర్ హిట్ రాలేదు. సాహో సినిమా ప్యూర్  యాక్షన్ చిత్రంగానే ఉంటుంది. కమర్షియల్ గా మాత్రం ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్ ని లవ్ స్టోరీగా తెరకెక్కించారు. ఈ మూవీ ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుందని అనుకున్నారు. అది మాత్రం సాధ్యం కాలేదు. అటు మాస్, ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా ఈ సినిమా నచ్చలేదు. దీంతో అది డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. 


ఆ తరువాత వచ్చిన సలార్ మూవీ ప్యూర్ మాస్ ఆడియన్స్ ని మెప్పించే మూవీగానే ఉంది కానీ సినిమా  బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకోలేదు. చాలా కాలం తర్వాత పూర్తిస్థాయిలో మాస్, క్లాస్ ఆడియన్స్ ని మెప్పించే కథాంశంతో ప్రభాస్ కల్కి 2898 ఏడీ మూవీని చేశాడు. సైన్స్ ఫిక్షన్ కి మైథాలజీ కాన్సెప్ట్ ని జోడించి ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ మూవీగా కల్కి 2898ఏడీని నాగ్ అశ్విన్ సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించారు.ఇక ఇప్పటికే ప్రేక్షకుల ముందుకొచ్చిన ట్రైలర్ చూస్తుంటే ఇది పవర్ ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటుగా ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే ఎమోషనల్ డ్రామాగా ,ఇంకా ఎంటర్టైన్మెంట్ కూడా ఉందని అర్ధమవుతోంది.ఈ కారణంగా సినిమాపై పాజిటివ్ బజ్ అనేది నడుస్తోంది. మైథాలజీ ఎలిమెంట్స్ ని ఎడాప్ట్ చేసుకోవడంతో హిందూ పురాణాలు బిలీవ్ చేసేవారికి కల్కి సినిమా నచ్చుతుందని చెప్పొచ్చు.ఇక ఈ మూవీతో ప్రభాస్ కచ్చితంగా తన స్టామినాని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉందని సినీ విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: