లోకేష్ శపధం : ఐటీ కంపెనీలు ఏపీ వైపు చూసేలా చేస్తా..!

FARMANULLA SHAIK
ఏపీ సీఎం లో చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించిన అనంతరం శుక్రవారం నాడు తన క్యాబినెట్ కోసం గెలిచిన ఎమ్మెల్యేకు మంత్రులుగా శాఖలు కేటాయించారు. అందులో నారా లోకేష్ గారికి ఐటీ &కమ్యూనికేషన్ మరియు మానవ వనరుల అభివృద్ధి శాఖ మరియు ఆర్టీజీశాఖలను కేటాయించారు.ఆ శాఖకేటాయింపు పై లోకేష్ హ్యాపీగా ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటె విద్య అనేది మాత్రమే భవిష్యత్తు తరాలకి దిశా నిర్దేశం చేసే ఒక సాధనం అని స్థాన్ఫర్డ్ యూనివర్సిటీ లో చదివిన నారా లోకేష్ యొక్క అభిప్రాయం అలాంటి విలువైన శాఖను తనకు ప్రభుత్వంకేటాయింపు పై ఆనందంగా ఉన్నారు.ఒకవైపు రాష్ట్రం అభివృద్ధి పరంగా పరుగులు పెట్టించాలంటే ఎన్నో ఐటీ పరిశ్రమలు రాష్ట్రానికి తెచ్చి పెట్టె సమర్ధత తనపై ఉన్నట్లు గుర్తించిన ప్రభుత్వం తనపై ఎంతో నమ్మకంతో ఐటీ శాఖ కూడా తనకే ఇవ్వడం పై లోకేష్ హర్షం వ్యక్తం చేశారు.దానికి తోడు ఎందరో ఎన్నారైలు ఇప్పటికే లోకేష్ తో టచ్ లో ఉండడంతో రాష్ట్రం అభివృద్ధి దిశగా ప్రయాణిస్తుందని విశ్లేషకులు అంటున్నారు.రాబోయే అయిదు ఏళ్లలో 20లక్షల ఉద్యోగాల హామీ పూర్తి చేస్తానని లోకేష్ అన్నారు.
ఉద్యోగాల కల్పనకు ఇతర రాష్ట్రాలనుండి పోటీ ఉంటుందని దానికోసం ఐటీ మరియు ఎలక్ట్రానిక్ కంపెనీలను ఆకర్షిస్థామని వలస వెళ్లిన యువతను స్థానికంగా ఉద్యోగాలు కల్పిస్తామని లోకేష్ అన్నారు.పరిశ్రమలో ఉద్యోగాలు సాధించేలా నైపుణ్య శిక్షణ ఇస్తామని మంత్రి లోకేష్ అన్నారు.గత అనుభవం నేర్పిన పాఠాలతో ఇప్పుడు మరింత సమర్ధవంతంగా పనిచేస్తానన్నారు. యువగళం పాదయాత్రలో కేజీ నుండి పీజీ వరకూ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తానని హామీ ఇచ్చానన్నారు.స్టాన్‌ఫోర్డ్ లో చదువుకున్న తనకు గ్రామీణ విద్యా వ్యవస్థను బలోపేతం చేసే అవకాశం రావడాన్ని ఒక పవిత్రమైన బాధ్యతగా స్వీకరిస్తున్నానన్నారు.తాను మంత్రిగా 2019లో పనిని ఎక్కడ ఆపానో.. అక్కడి నుండే తిరిగి ప్రారంభిస్తాను అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: