చంద్రబాబు దూకుడు: పొలవరంపై సంచలన నిర్ణయం ?

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిన నేపథ్యంలో... పాలనపై దృష్టి పెట్టారు చంద్రబాబు నాయుడు. 164 సీట్లతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం... జగన్మోహన్ రెడ్డి పాలనను మించిపోయేలా... చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. నిత్యం ప్రజల్లోనే ఉండేలా.. ప్రజల కోసం పనిచేసేలా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కృషి చేస్తోంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న వెంబడే.. పెన్షన్, డీఎస్సీ ఇలా ఐదు ఫైల్స్ పై సంతకాలు చేశారు.ఇక ఇప్పుడు.. ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుపై సంచలన నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబు నాయుడు.

తమ పాలనలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని.. లక్ష్యం పెట్టుకున్నారు చంద్రబాబు. అటు ఎన్నికల హామీలో భాగంగా... కచ్చితంగా పోలవరం పూర్తి చేయాల్సిందే. దానికి తగ్గట్టుగానే చంద్రబాబు నాయుడు...  పోలవరం ప్రాజెక్టు పైన ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఇక వచ్చేవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు చంద్రబాబు. శుక్రవారం రోజున సచివాలయంలో మంత్రులతో సీఎం చంద్రబాబు నాయుడు కీలక సమక్ష నిర్వహించారు. వచ్చే సోమవారం రోజున పోలవరం ప్రాజెక్టు పర్యటనకు వెళ్లాలని... మంత్రులతో చర్చించారట చంద్రబాబు.

వాస్తవానికి 2014 నుంచి 2019 సంవత్సరంలో  టిడిపి అధికారంలో ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టించారు చంద్రబాబు నాయుడు. కానీ... వైసిపి పాలన... చంద్రబాబు అంత కాకుండా పనులు కూడా భారీగానే జరిగాయి.అయితే ఈ తరంలో ఆ ప్రాజెక్టును పూర్తి చేయాలని అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు. ప్రస్తుతం ఆ ప్రాజెక్టులో అనేక సమస్యలు, కేసులు, సవాళ్లు ఉన్నాయి. వాటన్నిటిని మొదటగా పరిష్కరించి... ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలి.  అంటే వచ్చే సోమవారం నుంచి చంద్రబాబు రంగంలోకి దిగితే... పోలవరం ప్రాజెక్టు పై ఉన్న కేసులు, ఇతర సమస్యలను తీర్చడానికి డిసెంబర్ దాకా సమయం పడుతుంది.

అలాగే పోలవరం ప్రాజెక్టు కోసం ప్రత్యేకంగా కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు కేంద్రంలో చక్రం తిప్పుతున్న చంద్రబాబు నాయుడు... ఆ నిధులను తెచ్చుకునే పనిలో  పడాల్సి ఉంటుంది. అంటే కేంద్ర సహాయం కచ్చితంగా అవసరం. వెంటనే నరేంద్ర మోడీ తో మాట్లాడి... పోలవరం ప్రాజెక్టు కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని డిమాండ్ పెట్టాలి. ప్రస్తుత పరిస్థితుల్లో నరేంద్ర మోడీ కూడా ఆర్థిక సహాయం చేసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఆ దిశగా చంద్రబాబు నాయుడు అడుగులు వేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: