పుష్ప సినిమాలో ఆఫర్.. ఓపెన్ అప్ అయిన విజయ్ సేతుపతి..!?

Anilkumar
నటుడిగా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు విజయ్ సేతుపతి. ఎప్పుడూ ఒకేలాంటి కథలను కాకుండా డిఫరెంట్ పాత్రలను డిఫరెంట్ డిఫరెంట్ సినిమాలను చేస్తూ నటుడిగా ప్రేక్షకులకు ఎంతో దగ్గర అయ్యాడు. కేవలం తెలుగులోనే కాకుండా తెలుగులో సైతం పలు సినిమాలు చేసి ఇక్కడ కూడా మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. తమిళంలో చాలా బ్లాక్ బాస్టర్ సినిమాలను చేస్తూ స్టార్ హీరోగా వెలుగొందాడు.. ఆ తర్వాత విలన్ పాత్రలు చేసి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇక ఇప్పటివరకు హీరోగా చేసిన ఆయన ఉప్పెన

 సినిమాలో విలన్ పాత్రలో చేసి విలన్ గా సెట్ అయ్యాడు. ఇక ఆయనకు ఆ పాత్ర కోసం విమర్శల ప్రశంసలు కూడా దక్కాయి. ఎందుకు అంటే ఇప్పటివరకు హీరోగా ఉన్న ఆయన ఎందుకు ఉన్నట్టుండి విలన్ గా చేస్తున్నాడు అని చాలామంది ఆయనపై కోప్పడ్డారు. దాని తర్వాత చాలా సినిమాల్లో విలన్ పాత్రలు చేశాడు. తాజాగా ఇప్పుడు మహారాజా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఊహించని స్థాయిలో ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. మొన్నటి వరకు తమిళ్ లోనే రిలీజ్ చేస్తామన్న ఈ సినిమాని ఊహించని విధంగా తెలుగులో కూడా విడుదల చేశారు. మొదటి రోజే పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. సామినాథన్

 దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా జూన్ 14న విడుదల అయింది. ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఇక అందులో భాగంగా ఆయన మాట్లాడుతూ పుష్ప 2 సినిమా ఆఫర్ గురించి తెలిపాడు.. పుష్ప ఆఫర్ మీరు రిజెక్ట్ చేశారా..? అని అడగ్గా ఆసక్తికర ఆన్సర్ ఇచ్చాడు విజయ్ సేతుపతి. “సైరా తర్వాత ఉప్పెన వరకు గ్యాప్ తీసుకోలేదు. నేను సీరియస్ గా ప్రయత్నించాను సర్. కానీ ఎవరు నాుక అవకాశాలివ్వలేదు. పుష్ప మూవీలో నేను ఛాన్స్ రిజెక్ట్ చేయలేదు. అయితే అన్నిసార్లు నిజాలు మాట్లాడకూడదు. కొన్నిసార్లు అబద్ధాలు చెప్పడం మంచిది ” అని అన్నారు. పుష్ప లో నటించాలని ఉన్నా డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం వల్లే ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు గతంలోనే క్లారిటీ ఇచ్చారు విజయ్ సేతుపతి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: