సిగ్గుపడాల్సిన పనేలేదు తలెత్తుకు తిరుగుదాం.. రోజా ఇంట్రెస్టింగ్ పోస్ట్..??

Suma Kallamadi
2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఊహించని రీతిలో ఓటమి పాలయ్యింది. కనీసం 50 సీట్లకు పైగా వైసీపీ కైవసం చేసుకుంటుందని టిడిపి అనుకూల మీడియాలు కూడా సర్వే ఫలితాలు వెల్లడించాయి కానీ వైసీపీ ఆశ్చర్యపరిచే విధంగా కేవలం 11 సీట్లకే సరిపెట్టుకుంది. ఏపీ ఓటర్ల పల్స్ పట్టుకోవడం చాలా కష్టమని చాలా మంది రాజకీయ విశ్లేషకులే నోరేళ్లబెట్టారు.
ఈసారి సైకిల్‌ గాలి బాగా వీచడంతో వైసీపీ పార్టీకి చెందిన హేమాహేమీలందరూ కూడా ఓడిపోయారు. మాజీ మంత్రి, సినీ నటి రోజా సైతం చిత్తుగా ఓడారు. ఆర్కే రోజా నగరి నియోజకవర్గంలో వైసీపీ తరఫున పోటీ చేయగా.. టీడీపీ అభ్యర్థి గాలి భాను ఆమెను 40 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో ఓడించారు. అయితే ఎలక్షన్స్ కౌంటింగ్ రోజు ఉదయం నుంచి రోజా సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు పెట్టడం స్టార్ట్ చేశారు. ఫిలాసఫికల్ ట్వీట్ చేస్తూ ఆమె ఏపీలో హాట్ టాపిక్ గా మారుతూ వస్తున్నారు. తాజాగా మరోసారి ఆమె ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు."చెడు చేసి ఓడిపోతే సిగ్గుపడాల! కానీ.. మంచి చేసి ఓడి పోయాం! గౌరవంగా తలెత్తుకు తిరుగుదాం! ప్రజల గొంతుకై ప్రతిధ్వనిద్దాం!" అని ఒక రోజా కొద్ది గంటల క్రితమే ఒక ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్ కింద కామెంట్ సెక్షన్‌ను డిసేబుల్ చేశారు.
రోజా వైసీపీ ప్రభుత్వంలో మంత్రి పర్యాటక శాఖ మంత్రిగా పనిచేశారు. అయితే ఆమె గడిచిన 5 ఏళ్లలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ లపై ఘాటైన విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ ను మరీ దారుణంగా తిట్టారు. ఒక్క సీటు కూడా గెలవలేని అసమర్ధ నాయకుడు అంటూ విమర్శించారు. ఇక లోకేష్ ని కూడా ఒక ఆట ఆడుకున్నారు. అయితే ఇప్పుడు పరిస్థితి రివర్స్ కావడంతో ఆమెను ఇబ్బందులకు గురి చేయడానికి టీడీపీ పార్టీ కార్యకర్తలు, అభిమానులు చూస్తున్నారు. ఇక లోకేష్ కూడా ఆమె అవినీతి అక్రమాలను బయటపెట్టి జైలుకు పంపించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.
వైసీపీ ఓడిపోయాక సోషల్ మీడియాలో టార్గెట్ చేసే వారి సంఖ్య బాగా పెరిగిపోయింది ఆమెపై తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా గోపిస్తున్నారు. ఈ భయం వల్లే ఆమె తన కామెంట్ సెక్షన్ ఆఫ్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: