ప్రియురాలి పై మోజు తో హత్య.. స్టార్ హీరో అరెస్ట్..!

Divya
కన్నడలో నటుడుగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న దర్శన్ ఎప్పుడూ కూడా ఏదో ఒక విషయంలో వైరల్ గా మారుతూ ఉంటారు. ఇప్పుడు తాజాగా ఒక హత్య కేసులో దర్శన్ న్ని పోలీసులు అరెస్టు చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.. అసలు విషయంలోకి వెళ్తే నటి పవిత్ర గౌడ కు సంబంధించి అసభ్యకరమైన సందేశాలు పంపించినందుకు రేణుకా స్వామిని కొంతమంది హత్య చేసినట్లుగా సమాచారం. అయితే ఈ హత్య నటుడు దర్శన్ సూచనల మేరకే జరిగినట్లుగా కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ హత్య కన్నడ ఇండస్ట్రీలోనే ఒక సంచలనంగా మారింది.

ఈ హత్యకు కారణమైన నటుడు దర్శిన్ సైతం మైసూర్ లోని ఒక ఫామ్ హౌస్ లో పోలీసులు అరెస్టు చేసినట్లుగా సమాచారం. దర్శన్ తో పవిత్ర గౌడ సన్నిహితంగా ఉంటున్నట్లు గత కొన్నేళ్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలోనే పవిత్ర గౌడ్ కు రేణుకా స్వామి అనే వ్యక్తి కొన్ని అసభ్యకరమైన మెసేజ్లు పంపించి ఆమెను చాలా భయపెట్టేలా చేశారని ఈ విషయం పవిత్ర దర్శన్ కు చెప్పడంతో ఆ వ్యక్తిని హతమార్చడానికి దర్శన్ ప్లాన్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ హత్యను బెంగళూరులోని కామాక్షి ఆలయంలో హత్య చేసినట్లు తెలుస్తోంది.

ఈ కేసులో నటుడు దర్శన్ తో సహా పదిమందికి పైగా అరెస్టు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి . రేణుకా స్వామిని చిత్రదుర్గ నుంచి బెంగళూరుకు తీసుకు వచ్చిన తర్వాత అక్కడ ఒక షెడ్డులో ఉంచి.. అతడిని విచ్చలవిడిగా కొట్టారని.. దీంతో అతడు ఆ దెబ్బలు తట్టుకోలేక అక్కడికక్కడే మరణించినట్లుగా సమాచారం. ఆ మృతదేహాన్ని కల్వర్టులో పడేశారని తెలుస్తోంది.రేణుకా స్వామి హత్య పైన దర్శన్ హస్తం ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇదంతా ఇలా ఉంటే దర్శన్ గతంలో కూడా ఎన్నో వివాదాలలో చిక్కుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఏకంగా హత్య కేసులో చిక్కుకోవడంతో అభిమానుల సైతం ఆశ్చర్యపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: