ప్రధాని మోదీ నెలకు ఎంత శాలరీ పొందుతారో తెలుసా..??

Suma Kallamadi
నరేంద్ర మోదీ జవహర్‌లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి ప్రధాని అయి చరిత్ర సృష్టించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 240 లోక్‌సభ సీట్లు కైవసం చేసుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఎన్డీయే సాయంతో మోదీ ఈసారి పూర్తి మెజార్టీతో కేంద్రంలో అధికారంలోకి వచ్చారు. తాజాగా ఆయన హ్యాట్రిక్ పీఎం గా ప్రమాణ స్వీకారం చేశారు. ఈరోజుతో మోదీ 3.0 స్టార్ట్ అయింది. ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి బీజేపీ మద్దతుదారులైన చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్, చిరాగ్ పాశ్వాన్, శివసేన అధినేత ఏక్నాథ్ షిండే, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హాజరయ్యారు.
73 ఏళ్ల వయసున్న మోదీ 1952, 1957, 1962 సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ఘనతను సమం చేశారు. మోదీ సాధించిన ఈ ఘనత చిన్నదేం కాదు. అందుకే ఇప్పుడు భారతదేశవ్యాప్తంగా ఆయన గురించి మాట్లాడుకుంటున్నారు. ఇదే సందర్భంగా మోదీకి ఎంత శాలరీ వస్తుంది? ఆయన ఎంత సంపాదిస్తారు? అనే వివరాలను తెలుసుకోవాలని ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. మరి ఆ వివరాల గురించి మనమూ తెలుసుకుందామా
అధికారిక సమాచారం ప్రకారం, భారత ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీకి నెలకు రూ.1.66 లక్షల శాలరీ చెల్లిస్తుంది. ఇందులో రూ.50 వేలు బేసిక్ పేగా లభిస్తాయి. అడిషనల్ ఎక్స్‌పెన్సివ్స్ పేరిట మరో రూ.3 వేలు, నియోజకవర్గ అలవెన్సు కింద మరో రూ.45 వేలు చెల్లిస్తుంది. డైలీ అలవెన్స్‌గా రోజూ రూ.2 వేలు, ఆఫీస్ ఎక్స్‌పెన్సివ్స్‌గా మంత్లీ రూ.6 వేలు మోదీ పొందుతారు. పీఎంగానే కాకుండా ఎంపీగా కూడా పనిచేస్తారు కాబట్టి డైలీ అలవెన్సుగా రూ.3 వేలు అందుతాయి. ఇంటి నుంచి బయటికి వెళ్తే ఖర్చులు అవుతాయి కాబట్టి వాటిని కవర్ చేయడానికి రూ.3 వేల అలవెన్సుగా అందిస్తారు. ఇవన్నీ కలుపుకుంటే మొత్తం రూ.90 వేలు మోదీకి లభిస్తాయి.
 అలాగే ప్రధానమంత్రిగా ఆయనకు ఒక ప్రభుత్వ భవనాన్ని నివాసంగా అందజేస్తారు. అంతేకాకుండా ఫోన్ బిల్లు ఇతర సదుపాయాలకు అయ్యే ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది. మోదీ ట్రావెల్ ఖర్చులను కూడా గవర్నమెంట్ కవర్ చేస్తుంది. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్-ఎస్పీజీ మోదీకి ఉచితంగా రక్షణ కల్పిస్తుంది. ప్రధానమంత్రి తో పాటు ఆయన కుటుంబ సభ్యులు కలిసి జీవించగలిగేలా లగ్జరీ హౌస్‌ను రెసిడెన్స్ గా అందచేస్తారు. ఈ పీఎం రెసిడెన్సీ ఢిల్లీలోని 7 రేస్ కోర్స్‌ రోడ్‌లో ఉంటుంది.
ప్రభుత్వానికి చెందిన కార్లలో ప్రయాణించే అనుమతి ప్రధానికి ఉంటుంది. స్పెషల్ ఎయిర్ క్రాఫ్ట్ సైతం ఆయనకు అందుబాటులో ఉంటుంది. పీఎంతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు గవర్నమెంట్ మెడికల్ ఫెసిలిటీస్ కల్పిస్తుంది. పీఎం ఎన్ని నెలలు అయితే ప్రధానిగా సేవలు అందిస్తారో పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం పెన్షన్ కూడా ఇస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: