వేమూరు:నక్కతోక తొక్కిన ఆనంద్ బాబు.. వైసిపికి చుక్కలు చూపించాడుగా...!

Pandrala Sravanthi
ఉమ్మడి  గుంటూరు జిల్లాలోని మరో కీలకమైన నియోజకవర్గం వేమూరు. అలాంటి ఈ నియోజకవర్గం లో ఈసారి టిడిపి కూటమి మరియు వైసీపీ పార్టీ మధ్య విపరీతమైనటువంటి పోటీ ఏర్పడింది. మరి ఈ పోరు లో ఎవరు విజయం సాధిస్తారు ఎవరికి ఎంత మెజారిటీ వచ్చింది అనే వివరాలు చూద్దాం. వేమూరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వరికుటి అశోక్ బాబు అభ్యర్థిగా నియమించింది. ఈ స్థానం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సిట్టింగ్ స్థానం. ఇక్కడ మెరుగు నాగార్జున ఎమ్మెల్యే గా గెలిచారు. రెండో విడత క్యాబినెట్ లో మంత్రి కూడా అయ్యారు.

మార్పులు చేర్పుల్లో భాగంగా ఆయన స్థానం లోకి వరికుటి అశోక్ బాబు ను  తీసుకువచ్చింది వైసిపి అధిష్టానం. కానీ  అశోక్ బాబు అక్కడ వర్గ పోరును ఎదుర్కొంటున్నట్టు ప్రచారం సాగింది. మరి క్యాడర్ పూర్తిగా సపోర్ట్ చేసి ఓట్లు గా మలిచే ప్రయత్నం చేసిందా లేదంటే డీల పడేసిందా అనేది తెలియాల్సి ఉంది. తెలుగు దేశం పార్టీ నుంచి నక్క ఆనంద్ బాబు ప్రస్తుతం ఇన్చార్జి గా ఉన్నారు. ఆయన కే సీట్ కేటాయించింది తెలుగుదేశం అధిష్టానం. వైసిపి వర్గ పోరు ఆయన కు కలిసి వచ్చే అంశంగా అనిపిస్తోంది.  మరి చూడాలి వేమూరు ప్రజలు  ఎవరికి ఓట్లు వేశారు ఎవరి వైపు  నిలిచారు అనేది  ఎవరికి ఎంత మెజారిటీ అనేది చూద్దాం.

 ఇక్కడ టిడిపి నుంచి పోటీ చేసిన ఆనంద్ బాబు  16 రౌండ్లు ముగిసేసరికి  89,582 ఓట్లు సాధించారు. ఈయన సమీప వైసీపీ అభ్యర్థి అశోక్ బాబుకు  69,347 ఓట్లు వచ్చాయి. ఇంకొక రౌండ్ మిగిలి ఉండగానే ఆనంద్ బాబు 20,230 ఆదిక్యంతో విజయం దిశగా దూసుకెళ్తున్నారు. వేమూరు ప్రజలకు ఆనంద్ బాబు ఆనందాన్ని నింపాడని,  ఆయన నక్క తోక తోక్కి ఇక్కడికి వచ్చారని  , అందుకే విజయం ఖరారు అయిందని ప్రజలు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: