శ్రీశైలంలో ఎన్ని అభివృద్ధి పనులు చేపట్టినా శిల్పా చక్రపాణిరెడ్డికి ఓటమే గతి..??

Suma Kallamadi
నంద్యాల జిల్లాలోని శ్రీశైలం అసెంబ్లీ నియోజకవర్గంలో ముస్లిం ఓటర్లు (45 వేల ఓట్లు) ఎక్కువగా ఉన్నారు. 2024 ఎన్నికల్లో వైసీపీ నుంచి శిల్పా చక్రపాణిరెడ్డి, టీడీపీ కూటమి నుంచి బుడ్డా రాజశేఖర్‌రెడ్డి పోటీ చేశారు. శిల్పా చక్రపాణిరెడ్డి 1998 నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. 2011లో వైసీపీలో జాయిన్ అయ్యారు. 2014లో టీడీపీలో చేరి ఆ పార్టీ టికెట్‌పై పోటీ చేసి ఓడారు. రెండుసార్లు ఎమ్మెల్సీగా ఎంపిక అయ్యారు. 2019లో వైసీపీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచారు.
ఇక టీడీపీ అభ్యర్థి బుడ్డా రాజశేఖర్‌రెడ్డికి కూడా చాలా రాజకీయ నేపథ్యం ఉంది. ఆయన తండ్రి వెంగళరెడ్డి ఆత్మకూరు ఎమ్మెల్యేగా మూడుసార్లు విజయకేతనం ఎగరవేశారు. బుడ్డా రాజశేఖర్‌రెడ్డి 2004లో రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు, 2004, 2009 ఎన్నికల్లో ఓడిపోయారు 2014లో వైసీపీ నుంచి పోటీ చేశారు గెలిచారు, 2019లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.
* 2024 ఎలక్షన్ రిజల్ట్స్  
మొత్తం 23 రౌండ్లలో 16 రౌండ్లు ముగిసేసరికి టీడీపీ నేత బుడ్డా రాజశేఖర్‌రెడ్డి 56,867 ఓట్లు సాధించారు. వైసీపీ లీడర్ శిల్పా చక్రపాణిరెడ్డికి 53,364 ఓట్లు వచ్చాయి. 3,503 ఓట్లతో రాజశేఖర్‌రెడ్డి ముందంజలో ఉన్నారు. ఇంకా మెజారిటీ పెరిగే అవకాశం ఉంది, బుడ్డా గెలుపు ఈసారి ఖాయం అయిపోయింది.
శిల్పా చక్రపాణిరెడ్డి ఐదేళ్ల పాలనలో శ్రీశైలం నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. సంక్షేమ పథకాలను కూడా ప్రతి ఒక్కరికి అందేలాగా చూసుకున్నారు. అదే ఆయనకు పెద్ద ప్లస్ పాయింట్. కానీ అభివృద్ధి పనులు చేసిన ఈసారి ఆయనకు ఓటమే గతి అయింది. గతంలో కొంతమంది ఈయన పేరు మీద బ్యాంకుల్లో రుణాలు తీసుకోవడం, చిట్టీలు కట్టించుకోవడం చేశారు. దీనివల్ల ప్రభుత్వాల, జనాల సొమ్ముతో దోచేశారనే చెడ్డ పేరు ఆయనకు వచ్చింది. దీన్నే బాగా హైలైట్ చేస్తూ టీడీపీ ఓటర్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేసింది.
ఈ నియోజకవర్గంలో శ్రీశైలం, ఆత్మకూరు, వెలుగోడు, బండి ఆత్మకూరు, మహానంది మండలాలు ఉన్నాయి. మండలాల్లో కొన్ని వైసీపీ వైపు ఉంటే మరికొన్ని టీడీపీ వైపు ఉన్నాయి. ఇక్కడ ముస్లిం ఓటర్ల తర్వాత ఇక్కడ 20వేల ఓట్లతో యాదవ సామాజిక వర్గ ప్రజలు ఎక్కువ ఓట్లు కలిగి ఉన్నారు.19 ఎస్సీ ఓటర్లు, 19 వైశ్య ఓటర్లు, 16 రెడ్డి ఓటర్లు ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: