విజయనగరంలో జోరు చూపిస్తున్న కూటమి..!

Pulgam Srinivas
మొదటి నుండి కూడా అనేక సర్వేలు , ఎగ్జిట్ పోల్స్ రిపోర్ట్స్ విజయనగరంలో కూటమి భారీ ప్రభావాన్ని చూపబోతుంది అని చెబుతూ వస్తున్నాయి. ఇకపోతే అందుకు సంబంధించిన ఫలితాలే విజయనగరంలో ఇప్పటికే వెలువడ్డాయి. ఇకపోతే వై సి పి పార్టీ కూడా ఇక్కడ భారీ మొత్తంలో స్థానాలను దక్కించుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేసింది. కానీ ఆ ప్రయత్నాలు ఏమి ఫలించలేదు. ఇప్పటికే విజయనగరం లో చాలా చోట్ల కూటమి అభ్యర్థులు లీడింగ్ లో ఉన్నారు.

ఇక కొంత మంది ఇప్పటికే కూటమి అభ్యర్థులు గెలుపొందారు. మొదటి నుండి పార్వతీపురం అసెంబ్లీ స్థానాన్ని ఇటు కూటమి , అటు టి డి పి చాలా ఛాలెంజ్ గా తీసుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇక ఇక్కడ టి డి పి అభ్యర్థిగా బోనేల విజయ్ చంద్ర పోటీలోకి దిగగా , వై సీ పీ అభ్యర్థిగా అలజంగి జోగారావు బరిలో నిలిచారు. ఇక విజయ్ చంద్ర  23,650 ఓట్ల మెజారిటీతో జోగారావు పై గెలుపొందారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి మోహనరావు మూడో స్థానానికి పరిమితం అయ్యారు. ఈ రిజల్ట్ తో పాటు విజయనగరం జిల్లాలోని కురుపాం రిజల్ట్ కూడా వచ్చేసింది.

ఇక్కడ వై సి పి అభ్యర్థి అయినటువంటి పాముల పుష్ప శ్రీవాణి పై , టి డి పి పార్టీ అభ్యర్థి అయినటువంటి తోయాక జగదీశ్వరి విజయం సాధించింది. ఈ రెండు ఫలితాలతో పాటు సాలూరు నియోజకవర్గం ఫలితం కూడా తాజాగా విడుదల అయింది. ఈ నియోజకవర్గంలో వై సి పి పార్టీ అభ్యర్థి అయినటువంటి రాజన్న దొర పై , టి డి పి పార్టీ అభ్యర్థి అయినటువంటి సంధ్యారాణి గెలుపొందింది. ఇలా విజయనగరం జిల్లాలో ఇప్పటికే ముగ్గురు టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. మరికొన్ని స్థానాలలో టిడిపి అభ్యర్థులు లీడ్ లో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap

సంబంధిత వార్తలు: