" వైసిపి కౌంటింగ్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండండి ".. కౌంటింగ్ వేల సీఎం జగన్ కీలక సూచనలు..!

lakhmi saranya
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకుంది. మరికొన్ని గంటల్లో ఈ ఉత్కంఠకి పుల్ స్టాప్ పడనుంది. ఈ నేపథ్యంలోనే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా తన సందేశాన్ని పంచుకున్నారు. ఈ ఎన్నికలలో వైఎస్ఆర్సిపి కార్యకర్తలు అందరూ గొప్ప పోరాట స్ఫూర్తిని చాటారు అని అన్నారు. ఇక జూన్ 4న అనగా నేడు జరిగే కౌంటింగ్ ప్రక్రియలో కూడా అదే స్ఫూర్తిని కొనసాగించాలని పిలుపునిచ్చారు. ప్రజలు తమకు వేసిన ప్రతి ఓటును వైఎస్ఆర్సిపి ఖాతాలో పడేలాగా అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు.
తద్వారా తమ పార్టీకి అఖండ విజయాన్ని చేకూరుతుందని ఆశిస్తున్నాను అని అన్నారు. ఇక ఇదిలా ఉంటే ఏపీలో జరిగిన అసెంబ్లీ మరియు లోక్సభ ఎన్నికలలో వైఎస్ఆర్సిపి విజయం సాధిస్తుందని స్థానిక సర్వేలు ఎగ్జిట్ పోల్స్ ను విడుదల చేశాయి. ఇక అదే క్రమంలో కొన్ని జాతీయ పార్టీలు ఓటమి అధికారం లోకి వస్తుంది అని స్పష్టం చేయడం జరిగింది. ఈ రెండు సర్వేల నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ పై గందరగోళ పరిస్థితి నెలకొంది. అందుకే ప్రతి ఓటు కీలకమని భావిస్తున్నారు ఇరు పార్టీల సభ్యులు.
ఇక ఈ తరుణంలోనే కౌంటింగ్ ఏజెంట్లను అప్రమత్తం చేస్తున్నారు. అయితే పార్టీ గలుపు పై కీలక నేతలు సహా అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి ధీమాగా ఉన్నారు. తాము చేసిన సంక్షేమం పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకొస్తుందని గట్టి నమ్మకంపై నించున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా వైసిపి గెలవబోతుందని.. సంబరాలకు సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు తెలియజేశారు. మరికొన్ని గంటల్లోనే ఎవరిది గెలుపు ఎవరిది ఓటమి అనే విషయాలు స్పష్టం కానున్నాయి. ఏపీలో నెలకొన్న ఉత్కంఠ మరికొన్ని గంటల్లో విముక్తి కానుంది. ఇక గలుపు ఎవరిదైనా కష్టాలు తప్పవు అంటూ కొందరు భావిస్తున్నారు.  మరికొందరు మాత్రం తమ అభిమానం నాయకుడు గలవాలని కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: