ఆరా స‌ర్వే.. తెర‌వెన‌క అస‌లేం జ‌రిగింది... ఈ మాయ ఏంటి..?

lakhmi saranya
ఎగ్జిట్ పోల్స్ సర్వేలో విశ్వసనీయత ఉన్న సర్వేలు చాలా తక్కువగా ఉన్నాయి. ఏదో చెప్పడం.. తరువాత నాలుక కరుచుకోవడం వంటివి చాలా కామన్ గా మారిపోయింది. తెలంగాణ ఎన్నికల్లో 2023లో కేసీఆర్ ప్రభుత్వమే మరోసారి వస్తుందని.. ఓ రేంజ్ లో ప్రచారం జరిగింది. దానిని అనేక సర్వే సంస్థలు కూడా ప్రకటించారు. ఎగ్జిట్ పోల్ అంచనాలు కూడా.. కెసిఆర్ కు అనుకూలంగా వచ్చాయి. కానీ ఆరా మస్తాన్ సర్వే మాత్రం దీనికి భిన్నంగా వచ్చింది. కెసిఆర్ రాబోరని.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని తేల్చి చెప్పింది.

ఇక అదే జరిగింది కూడా. దీంతో ఆరా మస్తాన్ సర్వే పై విశ్వసనీయత పెరిగింది. అదేవిధంగా తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల జరిగినప్పుడు కూడా.. వైసిపి గెలుస్తుందని ఆరా మస్తాన్ అంచనా వేశారు. అప్పుడు కూడా అదే జరిగింది. అంతా విశ్వసనీయత ఉన్న ఆరా మస్తాన్.. ఇప్పుడు కూడా ఎగ్జిట్ పోల్స్ వెల్లడించారు. రాష్ట్రంలో వైసిపి 94-104 , టిడిపి కూటమి 71 -81 అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకుంటుందని తెలిపింది. అటు పార్లమెంట్ సీటు విషయానికి వస్తే వైసిపి 13- 15, టిడిపి కూటమి 10-12 ఎంపీ స్థానాలు కైవాసం చేసుకోవచ్చని అంచనా వేసింది.

అయితే ఇక్కడ దీనిని విశ్వసించే విషయంపై సందేహాలు మూసుకున్నాయి. ఆరా చెప్పింది వాస్తవమేనా? అనే రచ్చ టీడీపీ వర్గాలతో పాటు వైసిపి వర్గాల్లోనూ చర్చకు దారితీసింది. దీనికి రాజకీయాలే కారణమని తెలుస్తుంది. ఎన్నికలకు ముందు ఆరా మస్తాన్.. వైసిపి అధినేత జగన్ ను కలిశారని.. తన సతీమణికి గుంటూరు తూర్పు లేదా.. బెస్ట్ సీటును ఇవ్వాలని కోరారని.. రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతుంది. దీనికి జగన్ అంగీకరించలేదని.. ప్రజెంట్ సీటు ఇవ్వలేనని.. పార్టీ గెలిస్తే ఎమ్మెల్యే సీటు ఇస్తానని కూడా హామీ ఇచ్చినట్లు టిడిపి వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

అందుకే మస్తాన్... వైసీపీకి అనుకూలంగా పోల్ సర్వేలు వెల్లడించి ఉంటారని భావన వ్యక్తం అవుతుంది. అంతర్గత చర్యల్లో ఆరా మస్తాన్ టికెట్ వాస్తవమే వినిపించింది. అంతేకాకుండా సర్వే కోసం.. టిడిపి నుంచి ఆయన సొమ్ములు ఆశించారని.. కానీ వైసీపీకి టచ్ లో ఉన్నారన్న విషయం తెలిసిన టిడిపి వారు ఇవ్వలేదని.. సొమ్ము వైసిపి నే ఇచ్చిందని.. అందుకే ఆయన వైసీపీకి ఫేవర్ గా పనిచేసి ఉంటారని సందేహాలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: