వైసిపి పిటిషన్ ని కొట్టి పడేసిన హైకోర్టు.. సుప్రీంకు వెళ్లేందుకు సిద్ధం..!

lakhmi saranya
పోస్టల్ బ్యాలెట్ నిబంధనలపై శుక్రవారం వాయిదాలు ముగిసిన సంగతి తెలిసిందే. విచారణను ముగించి తీర్పును రిజర్వ్ చేసింది హైకోర్టు. శనివారం రోజు సాయంత్రం 6 గంటలకు తీర్పు వెల్లువరించినట్లు ప్రకటించగా.. నిన్న రాత్రి తీర్పు ఏపీ హైకోర్టు తెలిపింది. పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించి ఏపీ ఎన్నికల సంఘం ఇచ్చిన మెమో అభ్యంతరం వ్యక్తం చేసింది.. అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హైకోర్టును.. వైసిపి దాఖలు చేసిన పిటిషన్ ను కోర్ట్ తోసిపూచ్చింది.
ఎన్నికల సంఘం వాదనతో ఏకీభవించింది. ఇదే సమయంలో పోస్టల్ బ్యాలెట్ ఓటు సీల్ చేయకుండా కౌంటింగ్ కు అర్హత ఉందని ఎన్నికల కమిషన్ ఇచ్చిన వివరణను సమర్ధించింది ఏపీ హైకోర్టు. వైసిపి పిటిషన్ డిస్పోజ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. పిటిషన్ విచారణ అర్హత లేదని పేర్కొంది. ఎన్నికల పిటిషన్ దాఖలు చేయాలని పిటిషనర్ వైసిపి కి చెప్పింది హైకోర్టు. అయితే ఈ పరిణామాలపై స్పందించిన వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. పోస్టల్ బ్యాలెట్ వ్యవహారంపై సుప్రీం కోర్టుకు వెళ్లే యోచన లో ఉన్నాం అని అన్నారు.
పోస్టల్ బ్యాలెట్ పై ఈసీ తాను చేసిన నిబంధనలను కాదని ఎలా ఉత్తర్వులు ఇచ్చారు? అని ప్రశ్నించారు. దీంతో ఈ ఘటన మరింత చెలరేగాయి. మరో రెండు రోజుల్లో ఫలితాలు వెల్లుడు కానున్నాయి. ఇటువంటి సమయంలో ఇది వైసిపి కి పెద్ద షాక్ అని చెప్పుకోవచ్చు. ఫలితాలకి ముందే భారీ షాప్ కి గురైంది వైసిపి. దీంతో టీడీపీ అధినేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వారు వేసిన పిటిషన్ లో ఎటువంటి నిజం లేదంటూ మండిపడుతున్నారు. ఏదేమైనాప్పటికీ ఇది ఒక రకంగా వైసిపికి పెద్ద దెబ్బనే చెప్పుకోవచ్చు. ఫలితాలు రాకముందే భారీ షాప్ కి గురైంది వైసిపి. మరి ఫలితాల అనంతరం ఏ విధమైన ఉత్కంఠ నెలకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: