ఎగ్జిట్ పోల్స్ అనంతరం ఎన్నికల కమిషన్ అలర్ట్.. ఎస్పీ, జిల్లా కలెక్టర్ల కు కీలక ఆదేశాలు..!

lakhmi saranya
లోక్సభ తో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్ తరువాత ఎన్నికల కమిషన్ మరింత అలెర్ట్ అయినట్లు తెలుస్తుంది. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా చర్యలు తీసుకోనుంది. ఎలాంటి పరిస్థితి అయినా ఎదుర్కొనేందుకు అన్ని జిల్లాల కలెక్టర్లు మరియు ఎస్పీలు సిద్ధంగా ఉండాలని సూచించింది ఎన్నికల కమిషన్. ఏపీలో ఎగ్జిట్ పోల్స్ విడుదల తరువాత ఎన్నికల కమిషన్ మరింత అప్రమత్తమయింది. అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు మరియు ఎస్పీలకు కీలక సూచనలను జారీ చేసింది. ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా సూచనలు జారీ చేశారు.
తీవ్రమైన పోటీ నెలకొన్న నేపథ్యంలో భావుద్వేగాలు అదుపు తప్పే అవకాశం ఉందని ఈసిఓ వెల్లడించింది. ఎగ్జిట్ పోల్స్ ప్రకటన తరువాత ఉద్రక్త పరిస్థితులు మరింత పెరిగే ఛాన్సెస్ ఉందని అభిప్రాయపడ్డారు. దీంతో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పి లు సిద్ధంగా ఉండాలని తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల్లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిని వెంటనే బయటకి పంపి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఇక హింసాత్మక ఘటనల విషయంలో కఠినంగా వ్యవహరించాలని సూచించడం జరిగింది. సున్నితమైన ప్రాంతాల్లో ఎలాంటి గొడవలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. కీలకమైన పరిస్థితుల్లో తప్పుడు వార్తలను వెంటనే ఖండించాలని తెలిపారు సీఈఓ మీనా. కఠినమైన పరిస్థితుల్లోనే శాంత్రిభద్రతలను కాపాడుకోవడం ఎంతో అవసరం అన్నారు. అధికారులంతా సమిష్టిగా పనిచేసి సవాళ్లను ఎదురుకోవాలని తెలిపారు ముఖేష్ కుమార్ మీనా.
మరోవైపు ఓట్ల లెక్కింపు రోజు కౌంటింగ్ కేంద్రాల వద్ద ఏ చిన్న ఇబ్బంది కలిగిన.. ఉపేక్షించబోమని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా హెచ్చరించారు. ఓట్లు లెక్కింపు కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ ఉందని తెలిపారు. ఓట్లు లెక్కింపు కేంద్రాల్లో కౌంటింగ్ ఏజెంట్లు అలజడి సృష్టిస్తే.. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కౌంటింగ్ రోజు రాజకీయ పార్టీలు మరియు అభ్యర్థులు ఎటువంటి ర్యాలీలు, విజయోత్సవ వేడుకలు నిర్వహించేందుకు అనుమతి లేదని మరోసారి స్పష్టం చేశారు. కౌంటింగ్ పూర్తి అయిన తర్వాత కూడా పోలీసుల నిఘా కొనసాగుతుందని ముఖేష్ కుమార్ మీనా తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: