ఆ ఓట్లు పైనే..‌ నమ్మకం పెట్టిన టిడిపి.. ఏం జరుగుతుందో..!

lakhmi saranya
ఏపీలో అధికారంలోకి వచ్చి తీరాలని కంకణం కట్టుకుని పార్టీ టిడిపి సిద్ధమైంది. సుమారు మూడు సంవత్సరాల ముందు నుంచి కూడా పార్టీ ఈ దిశలోనే అడుగులు వేస్తుంది. నారా లోకేష్ నుంచి చంద్రబాబు వరకు ఎవ్వరు ఈ మూడు సంవత్సరాల్లో కంటి నిండా నిద్రపోలేదని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా క‌డుపు నిండా తిన్నది కూడా లేదు. దీనికి ప్రధాన కా పార్టీని కాపాడుకోవడంతో పాటు వైసిపి సర్కారు నుంచి ఎదురైన సవాళ్లను తట్టుకోవాల్సి రావడంతో పాటు అధినేత రాతు దేలీ మరి ప్రజల మధ్యకు వచ్చారు. పొత్తులు పెట్టుకున్నారు. అనేక విషయాల్లో సర్దుకు పోయారు కూడా. అంతిమంగా.. అన్ని తినై.  చంద్రబాబు ప్రచారం చేశారు.
ఇక ప్రస్తుతం తేడాల్సింది ఫలితం మాత్రమే. మరి ఇది ఎలా ఉంటుంది? అనేది పక్కన పెడితే ప్రధానంగా టిడిపి టార్గెట్గా పెట్టుకుంది ఉద్యోగుల ఓటు బ్యాంకు. అదేవిధంగా యువత ఓటు బ్యాంకు. ఉద్యోగులకు సంబంధించి కూటమి పక్షణ పెద్దగా ఇచ్చిన హామీలు ఏమీ లేవు. అయితే వైసీపీ నుంచి ఉద్యోగులకు ఎదురైన అనుభవాలు.. వేధింపులు వంటివి తమకు కలిసి వస్తాయని మాత్రం ఆశ పెట్టుకుంది. సుమారు 4.97 లక్షల మంది ఉద్యోగులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అదేవిధంగా 20 లక్షల మంది యువత కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో 85% తమకు అనుకూలంగా ఓటు వేసే వారని ఆలోచన టిడిపిలో ఉంది. ఇక వారి పైనే అసలు కూడా ఉంచారు టిడిపి నేతలు. యువతకు బాగానే హామీలు ఇచ్చారు.
తాము అధికారంలోకి రాగానే 20,000 ఉద్యోగాలతో మెగా డిఎస్సీ వేస్తామని.. నిరుద్యోగ భృతి కింద 3 ‌ వేల రూపాయలు నెలవారి ఇస్తామని హామీ ఇచ్చింది. అదేవిధంగా వచ్చే పదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తామని తెలిపారు. ఇక ఉద్యోగులకు పెద్దగా హామీలు ఇవ్వకపోయినా నెల ఒకటవ తేదీనే జీతాలు ఇచ్చే ప్రయత్నం చేస్తామని తెలిపారు. ఇక కీలక సమస్యగా ఉన్న సిపిఎస్ రద్దుకు లేదా దాని పరిష్కారానికి ఏడాదిలోగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇక వీటన్నిటిని నమ్మిన ఉద్యోగులు తమ ఓటు హక్కును టిడిపికి వినియోగించుకున్నారని తెలుస్తుంది. దీంతో తమకు ఈ ఓటు బ్యాంకు కలిసి వస్తుందని నాయకులు నమ్ముతున్నారు. పోలింగ్ జరిగిన తీరు తర్వాత ఉద్యోగులు చేసిన కామెంట్స్ చూస్తే వీరి అంచనా నిజం అనే లాగానే ఉంది. మరి జూన్ 4న మీరు ఎటు పిలిచారు అనేది స్పష్టం కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: