సేఫ్ జోన్ లో పవన్...కూటమి ఓడినా ఆ పదవి గ్యారంటీ ?
ఈసారి పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గెలుస్తారా లేదా అని అందరూ మాట్లాడుకుంటున్నారు. ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే దానికంటే ముందు పవన్ కళ్యాణ్ ని గెలుపు పైన బెట్టింగులు కూడా సాగుతున్నాయట. 2019 ఎన్నికల్లో రెండు చోట్ల దారుణంగా ఓడిపోయారు పవన్ కళ్యాణ్. భీమవరం అలాగే గాజువాక నియోజకవర్గంలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్... వైసిపి చేతిలో ఓడిపోయారు. అందుకే ఈసారి ఎలాగైనా గెలవాలని పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు.
పిఠాపురం నియోజకవర్గంలో కాపు ఓట్లు విపరీతంగా ఉంటాయి. ఆ ఓట్లే పిఠాపురం నియోజకవర్గ గెలుపును శాసిస్తాయి. దీంతో పిఠాపురం బరిలో నిలిచారు పవన్ కళ్యాణ్. ఇక తాజా సర్వేల ప్రకారం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తాడని తెలుస్తోంది. అయితే ఇలాంటి తరుణంలో జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు భారతీయ జనతా పార్టీ అదిరిపోయే ఆఫర్ ఇచ్చిందట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీలో కూటమి అధికారంలోకి వస్తే.. పవన్ కళ్యాణ్ కు ఉపముఖ్యమంత్రి పదవి గ్యారెంటీ అంటున్నారు.
బిజెపి కూడా ఇప్పటికే ఈ నిర్ణయం పై క్లారిటీ కూడా ఇచ్చేసిందట. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రాకపోతే... మరో ఆఫర్ కూడా ఉందట పవన్ కళ్యాణ్ కు..! ఎలాగైనా ఇండియాలో బిజెపి ప్రభుత్వం రావడం ఖాయం. ఇక అక్కడ ఓ కీలక పదవి పవన్ కళ్యాణ్ కు కట్టబట్టేందుకు నరేంద్ర మోడీ నిర్ణయం తీసుకున్నారట. కేంద్ర సహాయక మంత్రిగా పవన్ కళ్యాణ్ కు బాధ్యతలు ఇచ్చే ఛాన్స్ ఉందని నేషనల్ మీడియాలో కూడా కథనాలు వస్తున్నాయి. దీంతో తెలుగుదేశం కూటమి ఓడిన... లేదా గెలిచిన.... పవన్ కళ్యాణ్ కు మాత్రం ఒక పదవి గ్యారంటీ అని చర్చ జరుగుతోంది.