జ‌గ‌న్ సైన్యం: విదేశాల్లోనూ తెలుగోళ్ల‌కు స‌ల‌హాదారులు...!

RAMAKRISHNA S.S.
- జ‌గ‌న్ టీంలో విదేశీ స‌ల‌హాదారులుగా ఆరుగురు
- విదేశాల్లో ఇంత‌మంది స‌హాదారులతో వైసీపీ స‌ర్కార్ రికార్డ్‌
( విశాఖ‌ప‌ట్నం - ఇండియా హెరాల్డ్ )
ఏపీలోని వైసీపీ ప్ర‌భుత్వం నియ‌మించుకున్న స‌ల‌హాదారుల్లో కొందరునేరుగా ఏపీలో ఉంటే.. మ‌రికొంద రు ఢిల్లీలో ఉంటారు. ఇంకోంద‌రు.. విదేశాల్లోనూ ఉన్నారు. వీరు.. అక్క‌డి నుంచి ఏపీ ప్ర‌భుత్వానికి స‌ల‌హాలు ఇస్తుంటారు. వీరిలో ముగ్గురు కీల‌క స‌ల‌హాదారులుఉన్నారు. వీరికి సాయం చేసేందుకు మ‌రో ముగ్గురు ఉంటారు. మొత్తంగా ఆరుగురు స‌ల‌హాదారులు విదేశాల్లో ఉంటూ.. ఎన్నారై విభాగానికి ఏపీ ప్ర‌భుత్వానికి మ‌ధ్య అనుసంధానం చేస్తుంటారు. జ‌గ‌న్ ఇంత మంది స‌ల‌హా దారుల‌ను పెట్టాక వీరు త‌మ విధుల్లో స‌మ‌ర్థ వంత‌మైన పాత్ర పోషించి త‌మ‌దైన ముద్ర వేయ‌డంలో చాలా వ‌ర‌కు స‌క్సెస్ అయ్యారు.

వీరిలో మ‌ధ్య ఆసియా దేశాల‌తో అనుసంధానం చేసేందుకు ఒక స‌ల‌హాదారు ఉన్నారు. ఆయ‌నే  జుల్ఫీ మిడిల్‌, ఈస్ట్‌ దేశాల ప్రత్యేక ప్రతినిధిగా.. ఈయ‌న వైసీపీ స‌ర్కారుకు స‌ల‌హాదారుగా ఉన్నారు. ఆయా దేశాల్లో ఏం జ‌రిగినా.. ఈయ‌న వెంట‌నే ఇక్క‌డి ప్ర‌భుత్వానికి స‌మాచారం అందిస్తారు. అంతేకాదు... స‌ల‌హాలు కూడా ఇస్తారు. గ‌తంలో ఉక్రెయిన్‌-ర‌ష్యా యుద్ధ స‌మ‌యంలో ఈయ‌న సేవ‌లు బాగానే ఉప‌యోగ ప‌డ్డాయ‌ని.. స‌ర్కారు పెద్ద‌లు అప్ప‌ట్లో చెప్ప‌డం గ‌మ‌నార్హం.

ఇక‌, విదేశాల్లో ఉండే తెలుగు వారి కోసం.. ప‌నిచేసే స‌ల‌హారుడు... మేడపాటి ఎస్‌. వెంకట్‌. ఈయ‌న‌ నాన్‌ రెసిడెంట్‌ తెలుగు అఫైర్స్ స‌ల‌హాదారుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.  ఇత‌ర దేశాల్లోనితెలుగు వారిని ఈయ‌న స‌మన్వ‌య ప‌రుస్తున్నారు. ఈయ‌న ఇచ్చే స‌ల‌హాలు.. సూచ‌న‌లు... ప్ర‌భుత్వానికి ఏమేర‌కు ఉప‌యోగ ప‌డుతున్నాయో తెలియ‌దు కానీ... పార్టీకి మాత్రం అంతో ఇంతో దోహ‌ద‌ప‌డుతున్నార‌నే టాక్ ఉంది.

ఇక‌, పెద్దమల్లు చంద్రహాసరెడ్డి,.. ఈయ‌న కూడా నాన్‌-రెసిడెంట్‌ తెలుగు అఫైర్స్‌ డిప్యూటీ సలహాదారుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఏపీ స‌ర్కారుకు.. విదేశాల్లోని తెలుగు వారికి మ‌ధ్య స‌ల‌హాదారుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. మొత్తంగా విదేశాల్లో ఇంత మంది స‌ల‌హాదారులు ఉన్న ఏకైక రాష్ట్రం ఏపీనే కావ‌డం గ‌మ‌నార్హం. ఈ విష‌యం లో జ‌గ‌న్ స‌ర్కార్ అరుదైన రికార్డ్ క్రియేట్ చేసింద‌నే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: