జగన్ : రుషికొండ ప్యాలెస్...బాత్ టబ్ రూ.26 లక్షలు..?

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసిపి పార్టీ ఓడిపోయిన తర్వాత... జగన్మోహన్ రెడ్డిని తెలుగుదేశం పార్టీ టార్గెట్ చేస్తోంది. ఇక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ... జగన్మోహన్ రెడ్డి పై వివాదాస్పద పోస్టులు కూడా పెడుతోంది తెలుగుదేశం సోషల్ మీడియా. ఇప్పటికే... ఫర్నిచర్ దొంగ జగన్ అంటూ... రెండు రోజుల కిందట తెలుగుదేశం పార్టీ సంచలన పోస్ట్ పెట్టింది. ప్రభుత్వ డబ్బులతో.. కొనుగోలు చేసిన ఫర్నిచర్ మొత్తం జగన్ ఇంటిలో ఉందని ఆరోపణలు చేసింది.

అయితే దీనిపై వైసీపీ స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడంతో... ఇప్పుడు మళ్లీ కొత్త అంశాన్ని తెరపైకి తీసుకువచ్చింది.  రుషికొండ భవనాలను ఉద్దేశిస్తూ... వివాదాస్పద పోస్ట్ పెట్టింది. జగన్మోహన్ రెడ్డి రుషికొండ ప్యాలెస్ నిర్మించిన సంగతి తెలిసిందే. అక్కడి నుంచే జగన్మోహన్ రెడ్డి పాలన నిర్వహించాలని అనుకున్నారు. దానికోసమే అక్కడ కొత్త భవనాలు నిర్మించారు. అయితే తాజాగా టిడిపి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు... ఆ ప్యాలెస్ లోకి వెళ్లి కొన్ని ఫోటోలు రిలీజ్ చేశారు.

ఈ సందర్భంగా రుషికొండ భవనంలోని ప్రతి గదిని పరిశీలించి... అందులో ఉన్న బాత్రూంలను కూడా వదలకుండా... సోషల్ మీడియాలో పెట్టారు. ఈ ప్యాలెస్ కోసం 500 కోట్లు జగన్మోహన్ రెడ్డి... ఖర్చు చేశాడని ఈ సందర్భంగా ఆరోపించారు గంటా శ్రీనివాసరావు. అంతేకాదు ఒక బాత్రూమ్ కి 26 లక్షల రూపాయలు ఖర్చు చేశారని... తన భార్య వైఎస్ భారతికి గిఫ్ట్ ఇచ్చేందుకు ఇలా ప్రజా ధనం వృధా చేశారని... మండిపడ్డారు.

అయితే... దీనికి అదే స్థాయిలో వైసిపి సోషల్ మీడియా కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. రుషికొండ పైన కట్టిన భవనాలు... జగన్మోహన్ రెడ్డి కోసం కాదని... అది ప్రభుత్వ భవనాలని వెల్లడించింది. ముఖ్యమంత్రి ఎవరు ఉంటే... వారు... ఆ భవనాలను వాడుకోవచ్చని వైసిపి స్పష్టం చేసింది. నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు...  విశాఖపట్నం అభివృద్ధి కోసం ఎప్పుడైనా కృషి చేశాడా అని నిలదీసింది. జగన్మోహన్ రెడ్డి ప్రజల డబ్బును ఎక్కడా కూడా వృధా చేయలేదని వెల్లడించింది. అనవసరంగా జగన్మోహన్ రెడ్డి పై... పచ్చ మీడియా ప్రచారం చేస్తానని మండిపడింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: