ప్ర‌భాస్ ' కల్కి 2898 AD ' ప్రి రిలీజ్ బిజినెస్‌... మైండ్ బ్లోయింగ్ లెక్క‌లు... !

RAMAKRISHNA S.S.
టాలీవుడ్ యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ న‌టించిన క‌ల్కి 2898 ఏడీ సినిమా మ‌రి కొద్ది గంట‌ల్లోనే ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ఆకాశాన్ని అంటే అంచనాలతో వ‌స్తోన్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా భారీగా  బిజినెస్ జరుపుకుంది.  తెలుగు తో పాటు హిందీ - తమిళ్ - మ‌ళ‌యాళం లో కూడా గ్రాండ్ గానే రిలీజ్ కాబోతుంది. పాన్ ఇండియా రేంజ్‌లో వ‌స్తోన్న ఈ సినిమాపై దేశ వ్యాప్తంగానే కాదు.. ప్ర‌పంచ వ్యాప్తంగా కనివినీ ఎరుగ‌ని రేంజ్‌లో అంచ‌నాలు ఉన్నాయి.

ఇక ఇప్ప‌టికే దేశ‌వ్యాప్తంగా అన్నిచోట్లా బుక్కింగ్స్ ఓపెన్ అయ్యాయి. బుకింగ్స్ అలా ఓపెన్ అయ్యాయో లేదో చాలా స్పీడ్ గా టిక్కెట్లు అమ్ముడు అవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అయితే అస‌లు క‌ల్కి మానియా ఎలా ఉందో చెప్పక్కర్లేదు.  ఈ నేపధ్యంలో ఈ సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ ఎంత అయ్యింది.. ఎంత క‌లెక్ష‌న్లు వ‌స్తే బ్రేక్ ఈవెన్ అవుతుంద‌న్న‌ది కూడా ఆస‌క్తిగా మారింది. ఈ సినిమాను చాలా చోట్ల పంపిణీ దారులు మ‌నీ రిట‌ర్న్ గ్యారెంటీ మీద భారీ రేట్ల‌కు కొన్నారు.

అంటే పెట్టిన పెట్టుబ‌డి వెన‌క్కు రాక‌పోతే నిర్మాత ఆ మొత్తం వెన‌క్కు ఇవ్వాల్సి ఉంది. ఇక ప్రభాస్ సలార్ చిత్రం కొన్ని ఏరియాల్లో దెబ్బ  కొట్టింది. తర్వాత రికవరీ ఇవ్వాల్సి వ‌చ్చింది. ఇక ఏపీ తో పాటు తెలంగాణ‌లోనూ క‌ల్కి సినిమా రేట్లు పెంచుకునే వెసులు బాటుతో పాటు అద‌న‌పు షోల‌కు ప‌ర్మిష‌న్లు వ‌చ్చేశాయి. దీంతో తెలుగు నేల‌పై.. ఇక తెలుగు వారు ఎక్క‌డ ఉన్నా క‌ల్కి మానియా అయితే మామూలుగా లేదేనే చెప్పాలి.

క‌ల్కి ఏరియా వైజ్ బిజినెస్ లెక్కలు ఇలా ఉన్నాయి....
 
- నైజాం : 65 కోట్లు
- సీడెడ్ : 27 కోట్లు
- ఉత్తరాంధ్ర : 21 కోట్లు
- ఈస్ట్ గోదావరి : 14 కోట్లు
- వెస్ట్ గోదావరి : 10 కోట్లు
- గుంటూరు : 12 కోట్లు
- కృష్ణా : 12 కోట్లు
- నెల్లూరు : 7 కోట్లు
------------------------------------------------
ఆంధ్రా, తెలంగాణా టోటల్ : 168 కోట్లు
-------------------------------------------------

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: