రిలీజ్ ముందె కల్కి సినిమాకీ షాక్.. ఆందోళనలో ఫ్యాన్స్..!

Divya
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న చిత్రం కల్కి.. ఎట్టకేలకు రేపటి రోజున ఈ సినిమా ముందుకు రాబోతోంది. ముఖ్యంగా ఈ సినిమా టికెట్ల రేటు విషయంలో కూడా రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా ఇతర ప్రాంతాలలో కూడా భారీగా రేట్లు పెరిగిపోయాయి. ముఖ్యంగా స్పెషల్ షోలు వేసుకునేందుకు కూడా వెలుసుబాటు కలిగించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం.. అయితే తాజాగా వీటి పైన ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసినట్లుగా తెలుస్తోంది. వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ముఖ్యంగా కల్కి సినిమా టికెట్ల రేటును పెంచడంతో ఏపీ సర్కార్లు ఇచ్చిన జీవోను సైతం సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో లంచ్ మోసం పిటిషన్ వేసింది.. దీంతో అటు ఫాన్స్ సైతం ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికె టికెట్లు సైతం బుక్ చేసుకున్న వారి పరిస్థితి ఏమిటి ఒకవేళ తగ్గిస్తారా లేదా అనే అనుమానాలు కూడా మొదలవుతున్నాయి.. ఇప్పటికే బుక్ మై షో లో హాట్ కేకుల టికెట్ అమ్ముడుపోయాయి. అంతా బాగానే ఉన్నప్పటికీ ఇలా విడుదలకు ముందు హైకోర్టులో పిటిషన్ వేయడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.

రేపటి రోజున కల్కి సినిమా ఉదయం 5 గంటల 30 నిమిషాలతో ఆట మొదలవుతుందట.దీంతో కల్కి హంగామా మొదలు కాబోతోంది.కల్కి చిత్రానికి సంబంధించి అర్ధరాత్రి షోలు అనుమతి ఇచ్చిన కల్కి చిత్ర బంధం మాత్రం వీటిని అడ్వాంటేజ్ గా తీసుకోలేదు. దేశవ్యాప్తంగా కల్కి అడ్వాన్స్ బుకింగ్ కూడా భారీగా స్పందన రాబట్టింది. మొదటి రోజు రూ .200 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందనుకుంటున్న సమయంలో ఇలా లంచ్ మోషన్ పిటిషన్ వేయడం ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మరి ఈ విషయం పైన అటు ఏపీ సర్కార్ ఏ విధంగా స్పందిస్తుందో తెలియాల్సి ఉన్నది. ముఖ్యంగా టికెట్ల రేటు రెండు తెలుగు రాష్ట్రాలలో 400 రూపాయలకు పైగా ఉండడంతో ఈ పిటిషన్ వేసినట్లుగా సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: